Advertisement
శ్రీలంకకు చెందిన ఏంజెలో మాథ్యూస్ బంగ్లాదేశ్‌తో తన జట్టు ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్ పోరులో అంతర్జాతీయ మ్యాచ్‌లో “టైమ్ అవుట్” అయిన మొదటి క్రికెటర్ గా నిలిచాడు. రూల్స్ ప్రకారం చివరి బ్యాటర్‌ను అవుట్ చేసినప్పటి నుండి రెండు నిమిషాల నిర్ణీత సమయంలో బౌలర్‌ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాల్సి ఉంటుంది. ఆ సమయంలో బ్యాటర్ ప్రకటించలేకపోతే.. అతను టైమ్డ్ ఔట్ అయ్యాడు అని చెబుతుంటారు. ఈ లెక్కన గతంలో ఓ సారి గంగూలీ ఆరు నిముషాలు లేట్ గా వచ్చాడు. 2007 జనవరి నెలలో కేప్ టౌన్ లో దక్షిణాఫ్రికా తో మ్యాచ్ జరిగినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది.
Advertisement
అసలు అప్పుడు ఏమి జరిగిందంటే… జనవరి ఐదవ తేదీ మ్యాచ్ ప్రారంభం అయిన వెంట వెంటనే భారత్ రెండు వికెట్స్ ను కోల్పోయింది. దీనితో సౌరభ్ గంగూలీ ఫీల్డ్ లోకి రావాల్సి వచ్చింది. అసలు గంగూలీ కంటే ముందు నాలుగో ప్లేస్ లో సచిన్ రావాల్సి ఉంది. కానీ దక్షిణిణాఫ్రికా బ్యాటింగ్ చేసే టైం లో తగినంత సమయం లేకపోవడం వల్లే సచిన్ ను అంపైర్లు అనుమతించలేదు. జాఫర్ 10 గంటల 43 నిమిషాలకి అవుట్ అయ్యాడు. సచిన్ 10 గంటల 48 నిమిషాల వరకు బ్యాటింగ్ కు రావడానికి వీలు లేదు.
Advertisement
దీనితో సచిన్ బదులు వివిఎస్ లక్ష్మణ్ బ్యాటింగ్ కి రావాల్సి ఉంది. కానీ, అతను ఆ టైం లో స్నానం చేస్తుండడంతో.. అతని బదులుగా గంగూలీ రావాల్సి వచ్చింది. ఈ హడావిడి లో గంగూలీ పాడ్స్ కట్టుకుని, బ్యాట్ తీసుకుని వచ్చేసరికి ఆరు నిముషాలు ఆలస్యం అయ్యింది. అయితే.. అప్పటి దక్షిణాఫ్రికా కెప్టెన్ గ్రేమ్ స్మిత్ కూడా ఈ కారణాన్ని అంగీకరించి టైమ్డ్ అవుట్ అప్పీల్ వేయడానికి ఒప్పుకోలేదు. అంపైర్లు సజెస్ట్ చేసినప్పటికీ స్మిత్ స్పోర్టివ్ గా స్పందించి గంగూలీ ఆడడానికి ఒప్పుకున్నాడు. అప్పుడు కూడా షకీబ్ లాంటి కెప్టెన్ ఉండుంటే ఫస్ట్ టైమ్డ్ అవుట్ అయిన ఆటగాడిగా గంగూలీ ఉండేవాడు. ఈ మ్యాచ్ లో గంగూలీ 89 బంతుల్లో 46 పరుగులు చేసాడు.
Read More:
గుంటూరు కారం సినిమాలో ఎన్టీఆర్…? త్రివిక్రమ్ సినిమాటిక్ యూనివర్స్ రాబోతోందా?
భార్యకి అక్రమ సంబంధం ఉందేమో అన్న అనుమానంతో ఈ పోలీస్ ఎంత పని చేసాడో చూడండి!
పాక్ సెమీస్ కు వస్తే ముంబైలో ఆడదు.. బీసీసీఐ స్పష్టం.. ఎందుకంటే?