Advertisement
కట్టప్ప వెన్నుపోటు పొడిచినట్టే సౌతాఫ్రికాను కూడా ఆ టీం వాళ్ళే వెన్నుపోటు పొడవడం జరిగింది. సౌతాఫ్రికా జట్టుకు ప్రాతినిధ్యం వహించినోళ్లే, ఇప్పుడు ప్రత్యర్థులుగా మారి ఓటమిని తీసుకు వచ్చారు. ఇక పూర్తి వివరాలు చూస్తే.. మంగళవారం జరిగిన సౌతాఫ్రికా, నెదర్లాండ్స్ గేమ్ లో ఇలానే జరిగింది. నెదర్లాండ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన ముగ్గురు ప్లేయర్లు ఇది వరకు సౌతాఫ్రికా టీం లో ఆడారు.
Advertisement
స్పిన్నర్ రోలాఫ్ వాండర్ మెర్వ్, సైబ్రాండ్ ఎంగిల్‌బ్రెక్ట్, కోలిన్ ఏకెర్‌మెన్ ఇది వరకు సఫారీ టీం లో ఆడారు. సౌతాఫ్రికా ఓటమి ని ఎదుర్కోవడంతో సోషల్ మీడియాలోనూ మీమ్స్ మీద మీమ్స్ వేస్తున్నారు.
Advertisement
నెదర్లాండ్స్ తరుఫున ఆడిన వాండర్‌మెర్వ్ స్కోర్ ఎక్కువ చేయడానికి పరుగులు తీసాడు.19 బాల్స్ లో వాండర్ మెర్వ్ మూడు సిక్సర్లు, ఒక ఫోర్ చేసి 29 పరుగులు పూర్తి చేసాడు. వాండర్‌మెర్వ్ అయితే 9 ఓవర్లలో 34 పరుగులు చేసాడు.
కీలకమైన రెండు వికెట్లు తీసాడు. నెదర్లాండ్స్ బ్యాటింగ్‌లో ఎంగిల్‌బ్రెక్ట్ 19, ఏకెర్‌మెన్ 13 పరుగులు చేయడం జరిగింది. వర్షం కారణంగా 43 ఓవర్లకు మ్యాచ్ ని కుదించారు. ముందు బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్, 8 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసారు. సౌత్ ఆఫ్రికా 42.5 ఓవర్లలో, 207 రన్స్ చేసి ఆల్ అవుట్ అయ్యారు. 16 ఏళ్ల తర్వాత ఇప్పుడు సౌత్ ఆఫ్రికా పై విజయం సాధించింది.
Also read:
- విడాకులు తీసుకుంటున్న కూతురిని తండ్రి పుట్టింటికి ఎలా తీసుకొచ్చారో తెలిస్తే ఆశ్చర్య పోకుండా ఉండలేరు !
- ఇంగ్లాండ్ పై ఆఫ్ఘన్ గెలుపుకి BCCI చేసిన పరోక్ష సహాయం ఇదేనా ?
- ప్రవల్లిక కేసులో అసలు జరిగింది ఇదే.. సంచలన విషయాలు బయట పెట్టిన తల్లి, తమ్ముడు!