Advertisement
South African cricketer Keshav Maharaj Wife and Family Details: దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో పుట్టిన కేశవ్ మహారాజ్ క్రికెట్ అభిమానులకు సుపరిచితుడే. ఇతను విదేశీ వ్యక్తి అయినప్పటికీ ఇండియన్ కస్టమ్స్ పట్ల అభిమానం కలిగిన వ్యక్తి. ఈయన ప్రసిద్ధ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్‌గా మరియు వర్ధమాన క్రికెట్ స్టార్‌గా క్రికెట్ వరల్డ్ పై తన ఇంపాక్ట్ చూపించారు. క్రికెట్ ప్రపంచంలో ఈయన ప్రయాణం డర్బన్‌లో మొదలైంది. మహారాజ్ స్థానిక సర్క్యూట్‌లో క్రికెట్‌లో తన కెరీర్‌ను ప్రారంభించాడు మరియు ర్యాంక్‌ల ద్వారా త్వరగా ఎదిగాడు, దక్షిణాఫ్రికా యొక్క అత్యంత ప్రతిభావంతులైన స్పిన్ బౌలర్లలో ఈయన ఒకరుగా ఉన్నారు.
Advertisement
Keshav Maharaj Wife Name
కేశవ్ మహారాజ్ నవంబర్ 2016లో తన టెస్ట్ అరంగేట్రంతో ఆకట్టుకునే అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించాడు మరియు మే 2017లో వన్డే ఇంటర్నేషనల్ (ODI) జట్టులో చేరారు. కేవలం ఆరు సంవత్సరాలలో, మహారాజ్ తన బౌలింగ్ నైపుణ్యాలను ప్రదర్శిస్తూ దక్షిణాఫ్రికాకు కీలక ఆటగాడిగా ఎదిగాడు. అతను 2006-07 సీజన్‌లో 16 సంవత్సరాల చిన్న వయస్సులో తన క్వాజులు-నాటల్ లో ఎంట్రీ ఇచ్చారు. వరుస సీజన్లో ఆకట్టుకున్న తరువాత 2009-10లో డాల్ఫిన్స్ జట్టులో తన స్థానాన్ని సంపాదించుకున్నాడు. అక్కడినుంచి ఆయన వెనక్కి తిరిగి చూడలేదు.
Advertisement
రీసెంట్ గా జరుగుతున్నా మ్యాచ్లలో దక్షిణాఫ్రికా బౌలింగ్ దాడుల వెనుక మహారాజ్ నాయకత్వం ఉంది. ఈయన అసాధారణమైన బౌలర్ మాత్రమే కాదు, సౌతాఫ్రికా మరియు డాల్ఫిన్‌లకు అనుకూలంగా బాలన్స్ చెయ్యగల హిట్టర్ కూడా. అతని మల్టీ టాలెంట్ క్రికెట్ ప్రపంచంలో అతన్ని ఓ విలువైన ఆస్తిగా నిలబెట్టాయి. మహారాజ్ నైపుణ్యం కలిగిన కథక్ డ్యాన్సర్ లెరిషా మున్సామీని ప్రేమించారు. వీరి లవ్ స్టోరీ బాలీవుడ్ సినిమాల కంటే చాలా రొమాంటిక్‌గా ఉంటుంది. 2019లో నిశ్చితార్థం చేసుకున్న వీరు భారతీయ ఆచారాలకు కట్టుబడి 2022 లో వివాహం చేసుకున్నారు. భారతీయ సంస్కృతితో కేశవ్‌కి ఉన్న బలమైన సంబంధాలకు ఇది నిదర్శనం గా నిలిచింది. మొదట వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. అయితే కేశవ్ ఆవేశంగా నిర్ణయాలు తీసుకోవడం కంటే ఆలోచన మేలని అనుకున్నాడు. లేరీషా వద్ద అతను కథక్ నేర్చుకున్నాడు. అతని తల్లి 50 వ పుట్టిన రోజునాడు లేరీషతో కలిసి కథక్ నృత్యాన్ని ప్రదర్శించారు. ఎంతో ఎమోషనల్ అయిన ఆమె లేరీషతో వివాహానికి అంగీకరించారు. భారతీయ సంప్రదాయాన్ని మహారాజ్ ఎంతగానో ప్రేమిస్తారు. ఎంతలా అంటే.. చివరకు ఆయన బ్యాట్ పై ఓం కారాన్ని ముద్రించుకునేంతగా.
మరిన్ని క్రికెట్ వార్తల ని ఇక్కడ మీరు చూడొచ్చు ! తెలుగు న్యూస్ కొరకు ఇటు చూడండి !