Advertisement
సినిమా రంగంలో ప్రేమ పెళ్లిళ్లు అన్నవి చాలా కామన్ అయిపోయాయి. అయితే.. ఈ పెళ్లిళ్లు ఎక్కువ కాలం నిలవకుండా విడాకుల వైపుకు దారి తీస్తున్నాయి. అయితే.. కొన్ని జంటలు మాత్రం తమ మధ్య చిగురించిన ప్రేమను చిరకాలం దాచుకుంటున్నాయి. అలా.. సినిమా ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లి చేసుకున్నా.. కలిసే ఉన్న జంటలు ఎవరో ఇప్పుడు చూడండి.
Advertisement
వీటిని కూడా చదవండి: చంద్ర బాబు అరెస్ట్ తరువాత స్కంద సినిమాలో చేసిన మార్పులు ఇవేనా ?
నమ్రత-మహేష్ బాబు:
నమ్రత మహేష్ బాబు ని పెళ్లి చేసుకోక ముందు టాలీవుడ్ లో హీరోయిన్ గా నటించారన్న సంగతి తెలిసిందే. అయితే.. ఆమె మహేష్ బాబుతో ప్రేమలో పడ్డాక.. వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత సినిమాలకు దూరమైన నమ్రత తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటున్నారు. వీరికి గౌతమ్, సితార అని ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే.
వీటిని కూడా చదవండి: సీరియల్స్ నుండి సినిమాల్లోకి వచ్చిన టాప్ 10 సౌత్ ఇండియా యాక్టర్స్
Advertisement
నాగార్జున-అమల:
సినిమాల్లోకి రాకముందే నాగార్జున రామానాయుడు కుమార్తె లక్ష్మిని వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి నాగ చైతన్య పుట్టిన తరువాత గొడవలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తరువాత నాగార్జున సినిమా రంగంలో కొనసాగారు. తన కో యాక్టర్ అయిన అమలను నాగ్ ప్రేమించారు. ఆ తరువాత వీరి ప్రేమ పెళ్ళికి అడుగులేసింది. వీరిద్దరికి అఖిల్ జన్మించిన సంగతి తెలిసిందే.
సూర్య-జ్యోతిక:
సౌత్ ఇండస్ట్రీలోని క్యూట్ కపుల్స్ లో సూర్య జ్యోతిక పెయిర్ ముందుంటుంది. తమిళ్ లో వచ్చిన ఖాఖా ఖాఖి సినిమాతో వీరి పెయిర్ కి మంచి నేమ్ వచ్చింది. ఈ సినిమా తెలుగులో ఘర్షణ పేరుతొ రిలీజ్ అయ్యింది. వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. వీరిద్దరి మధ్య కూడా ప్రేమ చిగురించడంతో వీరు వివాహ బంధంతో ఒక్కటి అయ్యారు.
వీటిని కూడా చదవండి: “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” సినిమాలో విక్టరీ వెంకటేష్, మహేష్ బాబుల అసలు పేర్లు ఇవా?