Advertisement
చాలామంది సినిమాల నుండి రాజకీయాల్లోకి వెళ్తుంటారు. సినిమా నటలు ఎంతోమంది రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. చాలామంది సినీ నటులు ఫ్యాన్స్ ఉన్నారని రాజకీయాల్లోకి వెళితే కూడా బాగా రాణించవచ్చని సినిమాల నుండి రాజకీయాల్లోకి అడుగు పెడుతూ ఉంటారు. అయితే కొంతమంది సినిమాలు నుండి రాజకీయాల్లోకి వెళ్లి, తర్వాత సినీ అవకాశాలు కూడా కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అయితే సౌంత్ ఇండియన్ ఫిలిమ్స్ స్టార్స్ పాలిటిక్స్ లోకి వెళ్లి చీఫ్ మినిస్టర్ అయిన వాళ్ళు ఉన్నారు. మరి అలా సౌత్ ఇండస్ట్రీ నుండి పాలిటిక్స్ లోకి వెళ్లి ముఖ్యమంత్రి అయిన వాళ్ల గురించి ఇప్పుడు చూద్దాం.
Advertisement
CN అన్నాదురై:
తమిళలో మంచి రైటర్ ఈయన. ఈయన రాసినవి సినిమాలు గా తెరమీదకి ఎక్కాయి తమిళనాడు మొట్టమొదట సీఎం అన్నదురై.
ఎంజి రామచంద్రన్:
1977 నుండి 1987 వరకు కూడా సీఎంగా పని చేశారు. చనిపోయేంత వరకు కూడా సేవలు అందించారు. ఇలా సినిమాల నుండి సీఎం అయిన వాళ్లలో ఈయన కూడా ఒకరు.
జానకి రామచంద్రన్:
ఎంజీ రామచంద్రన్ చనిపోయిన తర్వాత ఆయన భార్య జానకి రామచంద్రన్ సీఎం అయ్యారు. 23 జనవరి 1988లో ఆమె 23 రోజుల పాటు సీఎం బాధ్యతలు తీసుకున్నారు. జానకి తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో మంచి పాపులారిటీని పొందారు.
ఎన్టీ రామారావు:
Advertisement
ఎన్టీఆర్ నటించిన సినిమాల గురించి ఎన్టీఆర్ నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఏడేళ్ల పాటు సేవలందించారు.
జయలలిత:
అమ్మగా జయలలిత బాగా పాపులర్ అయ్యారు. 1991 నుండి 2016 వరకు సీఎం గా పని చేశారు 14 సంవత్సరాలు పాటు ఆమె తమిళనాడు ముఖ్యమంత్రిగా సేవలందించారు.
ఎం కరుణానిధి:
భారతీయ రైటర్ మరియు పొలిటీషియన్ కరుణానిధి తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఐదేళ్లపాటు సేవలందించారు. 1969 నుండి 2011 వరకు ముఖ్యమంత్రిగా పని చేశారు కరుణానిధి.
ఎన్టీఆర్, జయలలిత మొదలు సీఎం అయిన 6 సౌత్ ఇండియన్ స్టార్స్ వీళ్ళే..!
Also read: