Advertisement
నేషనల్ ఫిల్మ్ అవార్డు. మనదేశంలో నిజమైన సినిమా కళాకారులకు అదొక కళ సినిమాను శ్వాసగా, ధ్యాసగా బతికే వాళ్లకు జాతీయ పురస్కారం అనేది గొప్ప అచీవ్ మెంట్. తాజాగా ప్రకటించిన 68వ జాతీయ చలనచిత్రం అవార్డుల్లో చత్రపతి శివాజీ సైన్యాధిపతి ‘తానాజీ’ జీవిత కథ ఆధారంగా తేరకెక్కిన ‘తానాజీ’ సినిమాలో నటనకు గాను అజయ్ దేవగణ్ ముచ్చటగా మూడోసారి జాతీయ అవార్డు వరించింది. మరోవైపు దక్కన్ ఎయిర్ వేస్ చీఫ్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘సురారై పోట్రు’ సినిమాకు ఉత్తమ నటుడు అవార్డు అందుకొనున్నాడు. ఇదే సినిమాలో నటనకు అపర్ణ బాలమురళి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకోనుంది. అయితే, ఇప్పటివరకు నేషనల్ అవార్డులు అందుకున్న సౌత్ స్టార్ల గురించి తెలుసుకుందాం.
Advertisement
Read also : ఉదయ్ కిరణ్ భార్య ఏం చేస్తుందో.. ఎలా ఉందో చూడండి..!!
కమల్ హాసన్:
1996 వ సంవత్సరంలో వచ్చిన ‘ఇండియన్’ (తమిళ్) చిత్రానికి గాను ఈయనకు నేషనల్ అవార్డు లభించింది.
మమ్ముట్టి:
1998 వ సంవత్సరంలో వచ్చిన ‘బాబా సాహెబ్ అంబేద్కర్’ (ఆంగ్ల) చిత్రానికి గాను ఈయనకు మరో నేషనల్ అవార్డు లభించింది.
మోహన్ లాల్:
Advertisement
1999 వ సంవత్సరంలో వచ్చిన ‘వనప్రస్తం’ (మలయాళం) చిత్రానికి గాను ఈయనకు మరో నేషనల్ అవార్డు లభించింది.
విక్రమ్:
2003 వ సంవత్సరంలో వచ్చిన ‘పితామగన్’ (తమిళ్) చిత్రానికి గాను ఈయనకు నేషనల్ అవార్డు లభించింది. ఈ చిత్రం ‘శివపుత్రుడు’ గా తెలుగులో కూడా రిలీజ్ అయింది.
ప్రకాష్ రాజ్:
2007 వ సంవత్సరంలో వచ్చిన ‘కాంచీవరం’ (తమిళ్) చిత్రానికి గాను ఈయనకు నేషనల్ అవార్డు లభించింది.
ధనుష్:
2019 వ సంవత్సరంలో వచ్చిన ‘అసురన్’ (తమిళ్) చిత్రానికి గాను ఇతనికి మరో నేషనల్ అవార్డు లభించింది.
సూర్య:
2020 సంవత్సరంలో వచ్చిన ‘సురారై పోట్రు’ (తమిళ్) చిత్రానికి గాను ఇతనికి నేషనల్ అవార్డు లభించింది.
నాగార్జున:
1997 వ సంవత్సరంలో వచ్చిన ‘అన్నమయ్య’ చిత్రానికి గాను ఇతనికి స్పెషల్ మెన్షన్ కేటగిరీలో నేషనల్ అవార్డు లభించింది.
Read Also : ఉదయ్ కిరణ్ తో మల్టీస్టారర్ మూవీ..నో చెప్పిన తరుణ్.. ఆ సినిమా ఏంటంటే..?