Advertisement
వైసీపీ, టీడీపీ మధ్య నువ్వా నేనా అంటూ సాగుతున్న పోరులోకి ప్రత్యామ్నాయంగా ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది జనసేన. అంతకుముందు కాంగ్రెస్, టీడీపీ సాగుతున్న పోరులోకి ప్రజారాజ్యం పార్టీ వచ్చింది. కానీ, చిరు మాదిరిగా పవన్ కాంప్రమైజ్ అయ్యే మనిషి కాదు. అందుకే పార్టీ పెట్టి 8 ఏళ్లు దాటినా నిలబడ్డారు. ఇప్పుడు 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు. 2019లో ఎదురైన సవాళ్లను అధిగమించేందుకు శర్వశక్తులూ ఒడ్డుతున్నారు.
Advertisement
ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉంది. రెండోసారి గెలుస్తామన్న ధీమాలో ఉంది. కానీ, టీడీపీ తమకు ఛాన్స్ ఇవ్వాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇదేం ఖర్మ అంటూ కార్యక్రమాలు చేపడుతోంది. అయితే.. ఆ రెండింటి పాలనను చూసిన జనాన్ని ఒక్క ఛాన్స్ అడుగుతోంది జనసేన. తమకూ అవకాశం కల్పిస్తే ప్రజా పాలన ఎలా ఉంటుందో చూపిస్తామని చెబుతోంది. వైసీపీ పాలనలో విధ్వంసాలే కనిపిస్తున్నాయని ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. ఈసారి జనసేన జెండా మెజార్టీ స్థానాల్లో గెలుస్తుందని ధీమాగా ఉంది.
Advertisement
ఈక్రమంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రచార రథం కూడా రెడీ అవుతోంది. దీనికి వారాహి అనే పేరు పెట్టారు. ఈ మేరకు పవన్ ‘వారాహి’.. రెడీ ఫర్ ఎలక్షన్ బ్యాటిల్ అని ప్రకటించారు. ఈ వాహనం ట్రయల్ రన్ ను హైదరాబాద్ లో పరిశీలించారు. వాహనానికి సంబంధించి కొన్ని ముఖ్య సూచనలను పార్టీ నాయకుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కి ఇచ్చారు. దాన్ని తీర్చిదిద్దుతున్న సాంకేతిక నిపుణులతోనూ చర్చించారు.
వారాహి ప్రత్యేకతలు
వారాహి.. వాహనాన్ని ప్రత్యేక భద్రతా చర్యలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దారు. పవన్ పర్యటనల సమయంలో విద్యుద్దీపాలు ఆర్పి వేసే కక్ష సాధింపు చర్యలు ఉన్నాయి. ఇటీవల విశాఖ పర్యటన సందర్భంలో వీధి దీపాలు ఆర్పివేశారు. అందుకే.. వారాహి వాహనంపై ప్రత్యేక లైటింగ్ ఏర్పాట్లు చేశారు.
వాహనం నుంచి పవన్ ప్రసంగించే సందర్భంలో లైటింగ్ పరమైన ఇబ్బందులు లేకుండా చుట్టూ ఏర్పాట్లు చేశారు. ఆధునిక సౌండ్ సిస్టం వినియోగించారు. వేల మందికి స్పష్టంగా ప్రసంగం వినిపించేలా రెడీ చేశారు.
వాహనానికి నలువైపులా సీసీ కెమెరాలు అమర్చారు. ఇది నిలిపిన, సభ నిర్వహించే ప్రదేశంలో పరిస్థితి రికార్డయ్యే ఫుటేజ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సర్వర్ కి రియల్ టైంలో వెళ్తుంది. 2008 నుంచి ఇప్పటివరకు పవన్ పర్యటనల్లో ఎదురయిన అంశాలని దృష్టిలో ఉంచుకొని భద్రతా చర్యలు తీసుకున్నారు.
వారాహి లోపల పవన్ కళ్యాణ్ తోపాటు మరో ఇద్దరు కూర్చొని చర్చించుకునే ఏర్పాటు ఉంది. అక్కడి నుంచి హైడ్రాలిక్ విధానంలో మెట్లు ఉంటాయి. వాటి ద్వారా వాహనం మీదకు చేరవచ్చు.