Advertisement
వెంకటేష్ మరియు వరుణ్ తేజ నటించిన తాజా సినిమా ఎఫ్3. ఎఫ్2 సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా వచ్చింది. సమ్మర్ కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాలో… అంతేగా, అంతేగా అనే డైలాగ్ చెప్పే నటుడు గురించి తెలిస్తే షాక్ అవుతారు. ఇప్పుడు ఆ నటుడి గురించి తెలుసుకుందాం..
Advertisement
ప్రదీప్ మనకి కేవలం ఒక ఆర్టిస్టుగా మాత్రమే పరిచయం.. కానీ ఆయన గతంలో సత్యం కంపెనీ హ్యూమన్ రిసోర్స్ మేనేజర్ (HR) గా 2006వ సంవత్సరం నుండి పనిచేశాడు.. ఒకపక్క ఇంత పెద్ద జాబ్ చేస్తూనే మరోపక్క ఖాళీ సమయం దొరికినప్పుడల్లా సినిమాలు మరియు సీరియల్స్ చేస్తూ ఉంటాడు.. వీటితోపాటు ఈయన వ్యక్తిత్వ వికాసం క్లాసులు కూడా తీసుకుంటూ ఉంటాడు.. అంతేకాకుండా యాంకరింగ్ చెయ్యాలనే ఉత్సాహం ఉన్న వారికి ప్రత్యేకమైన వర్క్ షాప్స్ కూడా నిర్వహించి ట్రైనింగ్ ఇస్తుంటాడు.. ఇదిలా ఉండగా సత్యం కంపెనీ కుంభకోణంలో మునిగిపోయి దివాలా తీసిన సంగతి మన అందరికీ తెలిసిందే.. అప్పట్లో ఈ సంఘటన IT రంగంలో పెను దుమారమే రేపింది.. అయితే ఈ కంపెనీని స్థాపించిన రామలింగరాజు గారు ‘ కంపెనీలో చాలా అవకతవకలు జరుగుతున్నాయి..
Advertisement
అతి త్వరలోనే ఈ కంపెనీ ముంగిపోబోతుంది’ అంటూ ప్రదీప్ తో మాట్లాడుతూ బాధపడుతూ ఉండేవారట.. ఆయన స్థానంలో వేరే వాళ్ళు ఉండి ఉంటే ఖచ్చితంగా ఎంప్లాయిస్ అందరిని జాబ్ నుండి పీకేసేవారని.. కానీ రామలింగ రాజు గారు తన కంపెనీలో పని చేస్తున్నా 52 వేల మందిలో ఒక్కరిని కూడా జాబ్ నుండి తొలగించలేదని చెప్పుకొచ్చాడు ప్రదీప్.. అప్పట్లో నేను ‘ వి ఆర్ విత్ యు సత్యం’ అని చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశానని ప్రదీప్ ఈ సందర్భంగా తెలిపాడు.. ఇక రామలింగ రాజు గారు కంపెనీ ని వదిలి వెళ్లిపోయిన తర్వాత సత్య మూర్తి గారు వచ్చారని.. ఆయన కూడా నాకు చాలా దగ్గర మనిషి అయ్యేసరికి జాబ్ మానలేక అలాగే కొనసాగాను అని చెప్పుకొచ్చాడు ప్రదీప్.. ప్రస్తుతం ప్రదీప్ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క సీరియల్స్ చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు.
Also read:
అనౌన్స్ చేసి రిలీజ్ కానీ… మహేష్ బాబు సినిమాలు ఇవే !