Advertisement
హోంబలే ఫిల్మ్స్ గురించీ ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ‘కేజిఎఫ్’ సిరీస్ ‘కాంతారా’ సినిమాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాలతో పాటు వీటిని రూపొందించిన నిర్మాణ సంస్థ హోంభలే ఫిలింస్ పేరు కూడా దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఈ నిర్మాణ సంస్థ నుంచి సినిమా వస్తుందంటే వైవిద్యంగా ఉంటుంది. పక్కా రికార్డులు తిరగరాస్తుంది అనే నమ్మకం ప్రేక్షకుల్లో కలిగింది. ఈ నేపథ్యంలో ప్రొడక్షన్ హౌస్ అసలు ఎప్పుడు మొదలైంది? జర్నీ ఎలా సాగింది? ఆ సంస్థకు ‘హోంభలే’ ఫిలిమ్స్ అని పేరు ఎందుకు పెట్టారు? వంటి విషయాలను తెలుసుకుందాం.
Advertisement
Advertisement
వాస్తవానికి విజయ్ కిరంగదూర్, చలువే గౌడ, కార్తీక్ గౌడ ముగ్గురు సృష్టించింది హోంభలే ఫిలిమ్స్. వారి ఇలువేల్పు హోంబలమ్మ కావడంతో నిర్మాణ సంస్థకు హోంభలే ఫిలిమ్స్ అని పేరు పెట్టారట. ఎలాంటి అవగాహన లేకుండా తీసిన మొదటి సినిమాతోనే ఫ్లాప్ అయింది. పునీత్ రాజ్ కుమార్ తో నిన్నిందలే సినిమా నిర్మించింది హోంభలే ఫిలిమ్స్. సినిమాలపై కసితో ఏడాది తిరిగేలోపు మాస్టర్ పీస్ అనే చిత్రాన్ని యష్ హీరోగా తెరకెక్కించారు. ఈ చిత్రంలోనే వారి ప్రయాణం ప్రారంభమైంది. అంతేకాదు, హోంభలే పేరును ఈ చిత్రం అందరికీ పరిచయం చేసిందని చెప్పాలి.
ఇక ఆ తర్వాత వరుసగా రాజకుమార, యువరత్న, కేజిఎఫ్ చాప్టర్ 1, కేజీఎఫ్ చాప్టర్ 2, కాంతారా వంటి సినిమాలు హిట్ లిస్ట్ లో చేరిపోయాయి. అప్పటివరకు కేవలం కన్నడం మాత్రమే పరిచయం ఉన్న వీరి పేర్లు కేజిఎఫ్ చాప్టర్ 1 సినిమాతో దేశమంతా మారుమోగిపోయాయి. ఇక కేజిఎఫ్ చాప్టర్ 2 ఏకంగా రూ.1250 కోట్లు కొల్లగొట్టింది. ఆ తర్వాత కేవలం రూ.16 కోట్లతో నిర్మించిన కాంతారా ఊహించని పాపులారిటీ సంపాదించుకుంది. రూ. 16 కోట్లతో సినిమా తెరకెక్కితే దాదాపు రూ. 370 కోట్లు వసూలు చేయడం విశేషం.
READ ALSO : కమలానికి గుచ్చుకున్న గులాబీ ముల్లు