Advertisement
సాధారణంగా ఆలయంలో దైవదర్శనం తర్వాత గుడిలో కొద్దిసేపు కూర్చుంటారు. ఇలా ఎందుకు కూర్చుంటారో చాలామందికి తెలియదు. మరికొందరు హడావుడిగా దైవదర్శనం పూర్తిచేసుకుని వెళ్లిపోతుంటారు. నిజానికి దైవదర్శనం తర్వాత ఆలయంలో కొద్దిసేపు కూర్చోవాలని మన శాస్త్రాలే చెబుతున్నాయి. స్థిరచిత్తంతో, ఐహికత్వాన్ని మరిచి, మౌన ధ్యానంతో, కొంత సమయం దేవాలయంలో కూర్చోవటం శాస్త్ర సమ్మతం అని పేర్కొంటున్నాయి.
Advertisement
READ ALSO : ప్లాఫ్ సినిమా కోసం వెళ్లి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ను వదులుకున్న రవితేజ..ఆ సినిమా ఏంటంటే..?
దేవాలయంలో అంటే దేవునికి ఎదురుగా అని కాదు, దేవాలయ ప్రాంగణంలో ఎక్కడైనా కూర్చోవచ్చు. ఇలా ఎందుకు కూర్చుంటారో చాలామందికి తెలియదు. మరికొందరు హడావుడిగా దైవదర్శనం పూర్తి చేసుకుని వెళ్లిపోతుంటారు. నిజానికి దైవ దర్శనం తర్వాత ఆలయంలో కొద్దిసేపు కూర్చోవాలని మన శాస్త్రాలే చెబుతున్నాయి. అలాగే ఆలయ ప్రవేశానికి కొన్ని నియమాలు ఉన్నాయి.
Advertisement
ఆలయం ప్రవేశించబోయే ముందు మన మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. అంతస్తు, హోదాను, గొప్పతనం, పలుకుబడిని ఆలయంలో ఎక్కడా, ఎవరి వద్ద ప్రదర్శించరాదు. ముఖ్యంగా మనలో ఉండే కోపాన్ని, అహంకారాన్ని, ఆదిక్యతను దేవాలయాల్లో చూపించరాదు. దేవుడు అందరికీ దేవుడే. దైవ కార్యాలకు అందరూ పెద్దలే. దైవ ప్రీతికి అందరూ పాత్రులే. దైవ పూజకు ప్రతి ఒక్కరూ అర్హులే. దైవదర్శనానికి అందరూ సమానమే. అనే విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకొని నడుచుకోవాలని మన శాస్త్రాలు, వేదాలు ఘోషిస్తున్నాయి.
READ ALSO : ఆర్ఆర్ఆర్ లో ఈ మిస్టేక్ గమనించారా.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు జక్కన్న..?