Advertisement
నిఖిల్ సిద్దార్థ్, ఐశ్వర్య మీనన్, సన్యా ఠాకూర్, అభినవ్ గోమతం స్పై సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మకరంద్ దేశ్‌పాండే, పశుపతి, నితిన్ మెహతా తదితరులు సహాయక పత్రాలు చేసారు. ఈ సినిమా కి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించగా వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమాని గ్యారీ బిహెచ్ తెర మీదకి తీసుకు వచ్చారు. ఈ చిత్రాన్ని కె రాజశేఖర్ రెడ్డి నిర్మించారు.
Advertisement
నిఖిల్ సిద్ధార్థ్ మంచి మంచి సినిమాలలో నటిస్తున్నారు. చక్కటి స్టోరీ వుండే మూవీస్ ని సెలెక్ట్ చేసుకుంటారు. కార్తికేయ 2 సినిమాలతో బాలీవుడ్లో పాపులారిటీని పొందారు. ఇప్పుడు వచ్చే స్పై సినిమా తెలుగు తో పాటుగా హిందీ వర్షన్ లో కూడా విడుదల కాబోతోంది. జూన్ 29, 2023 స్పై సినిమా రిలీజ్ కాబోతోంది. మరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Advertisement
Spy Movie Story: కథ మరియు విశ్లేషణ :
అజాద్ హింద్ ఫౌజ్‌ను స్థాపించి లక్షాలది మంది సామాన్యులను సుభాష్ చంద్రబోస్ సైనికుల్ని చేసారు. అయితే యుద్ధ సమయంలో విమాన ప్రమాదానికి గురై సుభాష్ చంద్రబోస్ ఆచూకీని భారతీయ చరిత్ర కోల్పోయింది. అయితే ఇప్పటికి కూడా అది మిస్టరీనే. ఆ స్టోరీ లో రహస్యాలని తీసుకు వచ్చి స్క్రీన్ మీద ఈ ‘స్పై’ లో చూపించారు. నేతాజీ కి సంబందించిన ఫైల్స్ టెర్రరిస్టుకి దొరుకుతాయి. అయితే వాటిని దుర్వినియోగం చేయడానికి ప్రయత్నించడంతో రా ఏజెంట్ నిఖిల్ దాన్ని ఆపడానికి ఏం చేస్తాడో అదే ఈ కథ. తన అన్నయ్య సుభాష్ ఎవరు..? ఎలా తమ్ముడు ప్రతీకారం తీర్చుకుంటాడు..? నేతాజీ మిస్టరీని ఛేదించారా లేదా అనేదే కథ.
సినిమాని ఆకట్టుకునేలా మొదలు పెట్టారు. సీన్స్ కూడా అందరినీ అలరించేలానే వున్నాయి. థ్రిల్లింగ్ గా ఈ మూవీ ని చూపించాలని ట్రై చేసాడు దర్శకుడు. యాక్షన్ ప్యాక్డ్‌గా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమా బాగుంది. నిఖిల్ లుక్, యాక్టింగ్, యాక్షన్ అన్నీ బాగున్నాయి. హీరోయిన్ ఐశ్వర్య మీనన్ కూడా బాగా యాక్ట్ చేసింది. రానా ఎప్పీయరెన్స్ కూడా బాగుంది. నితిన్ మెహతా విలన్ గా బాగా చేశాడు. శ్రీచరణ్ పాకాల సంగీతం బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. విజువల్స్ గ్రాండ్ గా ఉన్నాయి.
Spy Movie Review రేటింగ్:
2.25/5
Also read:
Samajavaragamana Review: సామజవరగమన స్టోరీ, రివ్యూ & రేటింగ్..!