Advertisement
ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత స్పెషల్ గా చెప్పుకునేది వివాహం మాత్రమే. సాధారణంగా ఎవరి జీవితమైనా పెళ్లికి ముందు పెళ్లి తర్వాత అని తప్పనిసరిగా చెప్పుకునే సందర్భాలు ఉంటాయి.. వివాహం తర్వాత జీవితమనేది మారుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కొత్త బంధం మనతో ఏకమవుతుంది. కాబట్టి వివాహాన్ని ప్రతి ఒక్కరు ప్రత్యేకంగా చేసుకోవాలని అనుకుంటారు. అయితే మన హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం అంటే ఒక పెద్ద పండగల నిర్వహిస్తారు.
Advertisement
also read: ఇప్పటిదాకా సీబీఐని నిషేధించిన రాష్ట్రాలివే..!
ఇందులో ముఖ్యంగా లగ్న పత్రికలు అనేది చాలా ఇంపార్టెంట్. మన టెక్నాలజీ ఎంతో ముందుకు పోతున్నా కానీ ఇప్పటికీ చాలామంది లగ్నపత్రికలు పంచడం అనేది ఆనవాయితీగా కొనసాగిస్తూనే ఉన్నారు. అప్పట్లో లగ్న పత్రికలు అయితే కాస్త సాదాసీదాగా ఉన్నా, ప్రస్తుతం వెరైటీ డిజైన్లు వచ్చాయి.. మరి అప్పట్లో అన్న తారక రామారావు బసవతారకమును వివాహం చేసుకునే సమయంలో ముద్రించిన వివాహ ఆహ్వాన పత్రిక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Advertisement
ఇందులో పదాలు కాస్త గ్రాంథిక భాషలో కనిపిస్తున్నాయి. వీరి వివాహం కొమరఓలు అనే గ్రామంలో జరిగినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ పత్రికను గుడివాడలోని శ్రీ బాల సరస్వతీ ప్రెస్ లో ముద్రించినట్టు కనబడుతోంది.22-04-1942 లో తన సొంత మరదలు బసవతారకమును ఎన్టీఆర్ వివాహమాడారు. అప్పట్లో వీరిని చూడముచ్చటైన దంపతులుగా కొలిచేవారు. 1985లో బసవతారకం అనారోగ్యంతో మరణించిన విషయం అందరికీ తెలిసిందే. ఆమె పేరు మీద బసవతారకమనే క్యాన్సర్ ఆస్పత్రిని ఎన్టీఆర్ ఏర్పాటు చేసి క్యాన్సర్ రోగులకు చికిత్స అందిస్తున్నారు.
also read: