Advertisement
అలనాటి నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇప్పటికీ ఆయన రెండు తెలుగు రాష్ట్రాలలోని జనాల గుండెల్లో ఉన్నారు. ఎన్టీఆర్ సినిమాల్లో నటిస్తూ, సినిమాలను డైరెక్ట్ చేస్తూ, ప్రొడ్యూస్ చేస్తూ, సినీ ఇండస్ట్రీని శాసించాడు. చెన్నైలో ఉన్నప్పుడే సినిమాల్లో విపరీతంగా సంపాదించాడు . హైదరాబాద్ కు వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని చోట్ల ఇన్వెస్ట్ చేశారు. అవి ఇప్పుడు కోట్ల విలువ చేసే ఆస్తులుగా మిగిలాయి!
Advertisement
Also Read: ఇంటి గుమ్మానికి నిమ్మకాయ, మిర్చి ఎందుకు కడతారు…? అలా కడితే ఏం జరుగుతుందంటే…!
అబిడ్స్ లోని రామకృష్ణ థియేటర్ ఎన్టీఆర్ చాలా ఇష్టంతో కట్టించుకున్న థియేటర్. ఆ తర్వాత దాని పరిసర ప్రాంతాలను కొనేసి ఎన్టీఆర్ ఎస్టేట్ గా పేరు పెట్టుకున్నారు. ఈ ఎస్టేట్ లో రామకృష్ణ థియేటర్ల తో పాటు ఎన్టీఆర్ నివసించిన ఇల్లు, ఆహ్వానం హోటల్ కాంప్లెక్స్ లు ఉన్నాయి. వాస్తవానికి ఎన్టీఆర్ జిల్లాకు ఒక్క థియేటర్ నిర్మించాలనుకున్నాడు. కానీ రాజకీయాల్లోకి రావడంతో అది కుదరలేదు. ముషీరాబాద్ లోని రామకృష్ణ థియేటర్. కాచిగూడ చౌరస్తాలోని తారక రామ థియేటర్.
Advertisement
మాసబ్ ట్యాంక్ లో గుట్టపై నిర్మించిన ఐదు ఇండిపెండెంట్ బిల్డింగ్స్ కట్టించి తన ఐదుగురు కొడుకులకు ఇచ్చేశాడు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 13 లో ఇల్లు, మొదట కూతురికి ఇచ్చిన ఈ ఇంటిని తర్వాత లక్ష్మీపార్వతి పేరున మార్చేశారు.గండిపేట ఆశ్రమం, తెలుగు విజయం భూములను కొనుగోలు చేశాడు. నాచారం హార్టికల్చర్ ఫిలిం స్టూడియో, ఎన్టీఆర్ కొన్ని రోజులు ఇక్కడ బస చేశారు. సినిమాల్లో ఎన్టీఆర్ సంపాదించినదంతా 1982లో తన పిల్లలకు పంచేశాడు. సన్యాసం తీసుకుంటున్నట్లు కూడా ప్రకటించారు.
ALSO READ : అసలు అగ్నిపథ్ స్కీం ఏంటి ? దేశవ్యాప్తంగా ఎందుకు దాన్ని యువత వ్యతిరేకిస్తుంది ?