Advertisement
ఏపీలో సోషల్ మీడియాలో పోస్టుల గురించి కూటమి ప్రభుత్వం మండిపడుతోంది. మొన్నటి వరకు సోషల్ మీడియాలో పిచ్చిగా పోస్టులు చేసి రెచ్చిపోయిన వాళ్లకి చుక్కలు చూపిస్తోంది. సోషల్ మీడియాలో వైసీపీ నేతలతో పాటుగా కార్యకర్తలు, సానుభూతిపరులని రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా కూడా వెంటాడుతోంది. ఇప్పటికే వందల సంఖ్యలో కేసుల్ని నమోదు చేసింది. చాలా మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Advertisement
హైకోర్టులో కూడా హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలు అయ్యాయి. విచారణ కూడా వీటి పై జరుగుతోంది. అయితే ఈ క్రమంలో గతంలో కూటమి నేతలపై విమర్శలు చేసిన వాళ్ళందరూ దారిలోకి వస్తున్నారు. లోకేష్ గారు సారీ మీ అమ్మగారికి మీ భార్య గారికి సారీ అనిత గారికి పవన్ కళ్యాణ్ గారికి సారీ అంటూ పేరు పేరునా క్షమాపణలు చెప్తున్నారు.
Advertisement
Also read:
శ్రీరెడ్డి ఒక వీడియోని విడుదల చేసింది. తన వలన తన కుటుంబానికి ఏ ఇబ్బంది రాకూడదని క్షమాపణలు చెబుతున్నట్లు శ్రీరెడ్డి చెప్పారు. ఇకమీదట సోషల్ మీడియాలో మీ గురించి కానీ మీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయనని శ్రీరెడ్డి వెల్లడించారు. భవిష్యత్తు లేదనుకోండి నేను పెళ్లి పెటాకులు లేవు అని అనుకోవట్లేదు అంటూ శ్రీ రెడ్డి చెప్పారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!