Advertisement
మెగా ఫ్యామిలీ నుండి చాలా మంది హీరోలు వచ్చి మంచి సక్సెస్ ఫుల్ హీరోలుగా మారారు కానీ మెగా డాటర్స్ మాత్రం సినిమాలకి దూరంగా ఉంటూ ఉంటారు. సినిమాలు కి దూరంగా ఉన్నా చిరంజీవి కూతుర్లుగా శ్రీజ, సుస్మిత మనకి పరిచయమే. మెగా డాటర్ శ్రీజ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా కూడా పెద్ద ఎత్తున వ్యక్తిగత కారణాల వలన వార్తల్లో శ్రీజ నిలుస్తూ ఉంటారు ప్రేమించిన వ్యక్తి కోసం పెద్దల్ని ఎదిరించి ఇంటి నుండి వెళ్లిపోయింది శ్రీజ.
Advertisement
పైగా ఆ టైంలో కుటుంబం నుండి తనకి ప్రాణహాని ఉందని పోలీస్ కేసు కూడా ఫైల్ చేసింది అప్పట్లో ఒక్కసారిగా ఈ వార్త సంచలనంగా మారింది. పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆమె తన భర్తతో విడాకులు తీసుకుని విడిపోయింది. తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేసింది. అయినా కూడా చిరంజీవి ఆమెని ఇంట్లో ఉంచుకుని రెండో పెళ్లి చేశారు. రెండో పెళ్లి తర్వాత కూడా ఇంకో బిడ్డకు జన్మనిచ్చాక, అతనితో కూడా విడాకులు తీసుకుని విడిపోయింది.
Advertisement
తాజాగా ఈమెకి సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి శ్రీజ పుట్టినప్పుడే అల్లు ఇంటికి కోడలుగా పంపాలని అనుకున్నారట. బన్నీ, శ్రీజ పెద్ద అయ్యి జీవితంలో స్థిరపడ్డాక పెళ్లి చేయాలని అనుకున్నారట. అయితే అప్పటికే శ్రీజ తను ప్రేమించిన వ్యక్తి కోసం వెళ్ళిపోయింది. అలా వెళ్లిపోవడంతో అల్లు ఇంటికి కోడలు అయ్యే అవకాశాన్ని కూడా కోల్పోయింది. ఆమె తప్పు చేయకపోయి ఉంటే హ్యాపీగా అల్లు ఇంటికి కోడలు అయ్యి సంతోషంగా ఉండేది.
Also read: