Advertisement
సన్ రైజర్స్ టీమ్ ఒకప్పుడు చాలా బాగా ఆడేది. 2016 లో ఐపీఎల్ ఛాంపియన్ గా సన్ రైజర్స్ హైదరాబాద్ నిలిచింది 2018లో అయితే రన్నర్ అప్ గా నిలిచింది కానీ 2021 నుండి చూసుకున్నట్లయితే, ఈ జట్టు ఆట తీరు మొత్తం మారిపోయింది. సన్ రైజర్స్ టీమ్ ఆట గాడి తప్పింది. గత మూడు సీజన్లో కూడా సన్రైజర్స్ టీం వెనుక పడుతూనే ఉంది. 2023 సీజన్ లో అయితే ఘోరంగా ఆఖరి స్థానాన్ని కైవసం చేసుకుంది.
Advertisement
Advertisement
అయితే, ఈ జట్టుకి సంబంధించి ఒక కీలకమైన మార్పుని చేయడం జరిగింది. హెడ్ కోచ్ బ్రియాన్ లారా ని తొలగిస్తూ వచ్చే సీజన్ నుండి కూడా అతను స్థానంలో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డేనియల్ వెటోరిని హెడ్ కోచ్ గా నియమిస్తున్నట్లు తెలుస్తోంది. సన్ రైజర్స్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు వచ్చే సీజన్ నుండి హెడ్ కోచ్ విషయంలో ఈ మార్పులు రాబోతున్నాయి. మరి ఇక ఈసారైనా సన్ రైజర్స్ హైదరాబాద్ ముందులాగ మంచి ఆటని ప్రదర్శిస్తుందా లేదా అనేది చూడాలి. అలానే కొంత మంది ప్లేయర్స్ ని కూడా ఈసారి తొలగించనున్నారు.
Also read: