Advertisement
తెలుగు చిత్ర పరిశ్రమ మర్చిపోలేని నటుడు ఎన్టీ రామారావు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించి స్టార్ హీరోగా రాణించారు. సాంఘిక, పౌరాణిక, రాజకీయ చిత్రాలలో నటించిన ఎన్టీఆర్ గొప్ప నటుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పటి స్టార్ హీరోయిన్లు అందరి సరసన ఎన్టీఆర్ సినిమాలు చేశారు. సావిత్రి, జానకి, అంజలి, రాజశ్రీ, మంజుల, లక్ష్మీ, జయసుధ, జయప్రద, కృష్ణకుమారి, శ్రీదేవి లతో ఎన్టీఆర్ సినిమాలు చేసి వినోదాన్ని పంచారు. అయితే ఎన్టీఆర్ పక్కన ఇండస్ట్రీలో ఒకే ఒక హీరోయిన్ మనవరాలుగా మరియు హీరోయిన్ గా నటించింది. మరెవరో కాదు అది లోక సుందరి శ్రీదేవి.
Advertisement
1972 వ సంవత్సరంలో ఎన్టీఆర్ బడిపంతులు అనే సినిమాలో నటించాడు. ఈ సినిమాకు చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఎన్టి రామారావు హీరోగా నటించగా, అంజలి హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో కృష్ణంరాజు, రామకృష్ణ జగ్గయ్య, విజయ లలిత ముఖ్యమైన పాత్రల్లో నటించారు. కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ మనవరాలిగా శ్రీదేవి నటించి ఆకట్టుకుంది. అప్పట్లో ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాతో శ్రీదేవికి బాలనాటిగా మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమా తర్వాత శ్రీదేవి తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసింది.
Advertisement
ఇది ఇలా ఉండగా, శ్రీదేవి టాలీవుడ్ లో అనురాగాలు అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బంగారక్క అనే సినిమాలో నటించింది. ఆ వెంటనే పదహారేళ్ళ వయసు సినిమాలో నటించింది. ఇలా వరుస సినిమాలు చేస్తున్న శ్రీదేవి 1979లో కే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన వేటగాడు సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో ఎన్టీ రామారావు హీరోగా నటించగా శ్రీదేవి ఆయనతో జతకట్టింది. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కానీ ఎన్టీఆర్ మనవరాలు వయసున్న అమ్మాయితో స్టెప్పులు వేయడం ఏంటి అంటూ విమర్శలు కూడా వచ్చాయి.
READ ALSO : డైరెక్టర్ త్రివిక్రమ్ భార్య ఎవరు ? ఆమె ఏం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే ..!