Advertisement
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంతమంది సినీ యాక్టర్స్ బయట జనాలకి తెలియకపోవచ్చు కానీ, శ్రీ రెడ్డి అంటే తెలియని వారు ఉండరు. ఆమె సినిమాల్లో నటించక పోయినా సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక వివాదంతో బయటకు వస్తూనే ఉంటుంది. ఇండస్ట్రీలో ఉండేటువంటి కాస్టింగ్ కౌచ్ గురించి అత్యధికంగా మాట్లాడే సెలబ్రిటీ శ్రీరెడ్డి. కాస్టింగ్ కౌచ్ మీద శ్రీ రెడ్డి ఏకంగా ఫిలిం చాంబర్ ముందు అర్ధన* ప్రదర్శన చేసింది. దీంతో దేశవ్యాప్తంగా విమర్శ పాలైంది. అయితే గత కొన్ని రోజులుగా శ్రీరెడ్డి హైదరాబాదు నుండి తమిళనాడుకు మకాం మార్చేసింది. ఈమధ్య తను హైదరాబాదు వదిలి వెళ్లిపోవడానికి కారణాలు తెలియజేసింది.
Advertisement
Also Read: వారాహి వెహికిల్ హీరోయిన్ల మేకప్ కోసమేనా..లక్ష్మి పార్వతి సంచలన వ్యాఖ్యలు..!!
తెలుగు ఇండస్ట్రీలో చాలామంది పెద్ద కుటుంబాలు నాకు అవకాశాలు రాకుండా చేశారని ఆరోపించింది. సినిమాల్లో కానీ టీవీ రంగంలో కానీ ఎక్కడ తనకు అవకాశాలు రాకుండా అడ్డుకట్ట వేస్తున్నారని చెన్నై వెళ్లి యూట్యూబ్ ద్వారా సంపాదించుకుంటున్నానని తెలియజేసింది. అయితే ఇటీవలే చాలా రోజుల గ్యాప్ తర్వాత తెలుగు మీడియాలో మళ్లీ మాట్లాడింది శ్రీరెడ్డి. ఈ తరుణంలో రాజకీయాల మీద కూడా కొన్ని కామెంట్స్ చేసింది దీంతో వైరల్ గా మారింది. తెలంగాణ రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న సంఘటనల గురించి మాట్లాడింది.
Advertisement
Also Read: కేటీఆర్ పై కిషన్ రెడ్డి.. మోడీపై కేటీఆర్.. పంచ్ ల ప్రవాహం..!
గిరిజన యువతి పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆ*త్య, గిరిజన యువకుడు నవీన్ హత్య, నాలుగు సంవత్సరాల చిన్నారి కుక్కల దాడిలో మరణించడం, ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆ*త్య వంటివి విషాద ఘటనలు జరుగుతున్న కెసిఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించింది. ఇక మంత్రి కేటీఆర్ సినిమా వేడుకలకు వెళ్తూ , వారితో ఫోటోలకు ఫోజులిస్తూ ఉంటారు తప్ప ఇటువంటి విషాద ఘటనలను పట్టించుకోరని అన్నది. ఎందుకంటే వాళ్లు సెలబ్రిటీలు కాదు కాబట్టి అంటూ విమర్శించింది. పేదవాళ్లు, గిరిజన పిల్లలు కాబట్టి ప్రాణం పోయినా వెంటనే శవాన్ని ఎత్తేయాలి రోడ్లమీదకి వచ్చి ధర్నాలు చేయకూడదు అంటూ శ్రీరెడ్డి ఎద్దేవా చేసింది. ప్రస్తుతం ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.