Advertisement
టాలీవుడ్ లో రాజమౌళి, కీరవాణి లు ఇద్దరు అన్నదమ్ములు. ఒక ఇంటికి చెందిన వ్యక్తులు. కాకపోతే వీరిద్దరి పేర్లకు ముందు అంటే రాజమౌళికి ఏమో ఎస్ ఎస్ అని, కీరవానికి ఏమో ఎం ఎం అని ఉంటాయి. మరియు ఒకే ఇంటికి చెందిన వ్యక్తులకు ఇలా వేర్వేరు పేర్లు ఎందుకు వచ్చాయో ఇప్పుడు చూద్దాం. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇంటి పేరు కోడూరి. వీరిద్దరి ఇంటి పేరు కూడా అదే.
Advertisement
Read Also : ఉదయ్ కిరణ్ తో మల్టీస్టారర్ మూవీ..నో చెప్పిన తరుణ్.. ఆ సినిమా ఏంటంటే..?
పైగా ఇండస్ట్రీలోనే ఉన్న మరో మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణి కోడూరి ఒక్కరే ఇంటిపేరుతో అందరికీ పరిచయం ఉన్నారు. కానీ కోడూరి రాజమౌళి అన్నా లేదంటే కోడూరి కీరవాణి అన్నా ఎవరు పెద్దగా గుర్తుపట్టారు. ఎస్ ఎస్ రాజమౌళి, లేదంటే ఎం ఎం కీరవాణి అంటేనే గుర్తుపడతారు. అంతల వీరిద్దరి పేర్లు పాతుకుపోయాయి. అయితే రాజమౌళి పేరుకు ముందు ఎస్ ఎస్ రావడానికి ఓ కారణం ఉంది. అదేంటంటే, ఆయన పూర్తి పేరు శ్రీశైల శ్రీ రాజమౌళి. శ్రీశైల శ్రీ అంటే చాలా పెద్దగా అయిపోతుందని దాన్ని షార్ట్ కట్ లో ఎస్ ఎస్ అక్షరాలకి తగ్గించేశారు. అందుకే ఆయన ఎస్ ఎస్ రాజమౌళి గా గుర్తింపు తెచ్చుకున్నారు.
Advertisement
MM Keeravani and SS Rajamouli
ఇక కీరవాణి పేరు కూడా ఇలాంటిదే. ఆయన పూర్తి పేరు మరకతమణి కీరవాణి. అయితే ఈ పేరును కూడా షార్ట్ కట్ చేసేసి ఎం ఎం కీరవాణిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇకపోతే ప్రేమించు, అదిరిందయ్యా చంద్రం సినిమాలకు మ్యూజిక్ అందించిన ఎం ఎం శ్రీలేఖ వీరి సిస్టర్. ఆమె పేరు మణి మేకల శ్రీలేఖ. దాంతో ఆమె పేరు ముందు కూడా ఎం ఎం అనే పేరు యాడ్ అయిపోయింది. ఇలా ఒకే ఇంటి నుంచి వచ్చి పేర్లు తగ్గించుకొని అగ్ర దర్శకుడిగా ఒకరు, అగ్ర మ్యూజిక్ డైరెక్టర్ గా మరొకరు రాణిస్తున్నారు అన్నమాట.
Read Also : టాలీవుడ్ విలన్ రఘువరన్ కొడుకు, ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా ?