Advertisement
ఈనాడు అధినేత రామోజీరావుకు, ఏపీ సీఎం, వైసిపి అధినేత జగన్ కు మధ్య పెద్దగా సంబంధాలు లేని విషయం తెలిసిందే. ఒకవేళ ఉన్న, అప్పటికప్పుడు ఉన్న అవసరాల నేపథ్యంలో ఇద్దరు సర్దుకుపోయిన విషయం కూడా అందరికీ తెలిసిందే. పాదయాత్ర సమయంలో తన వార్తలను కవర్ చేయాలంటూ, జగన్ స్వయంగా రామోజీని కలిసి అభ్యర్థించిన, అది అప్పటికే సరిపోయింది. ఎన్నికల సమయానికి వచ్చేసరికి ఈనాడు వ్యవహారం, టిడిపికి అనుకూలంగా మారిపోయింది. ఇక జగన్ సీఎం అయ్యాక, ఈనాడు రామోజీని టార్గెట్ చేశారు.
Advertisement
ఈ తరుణంలోనే తాజాగా, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చిట్ ఫండ్, ఫైనాన్స్ కంపెనీల్లో సోదాలు నిర్వహించారు. మార్గదర్శి సహా పలు చిట్ ఫండ్ కంపెనీల్లో తనిఖీలు చేపట్టారు. చిట్ ఫండ్, ఫైనాన్స్ అక్రమాలపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు దాడులు చేశారు. ఈ సోదాల్లో తీవ్ర అక్రమాలు, ఉల్లంఘనలు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. దీంతో ప్రజల కష్టార్జితాన్ని పరిరక్షించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కాగా అక్టోబర్ 21న 12 చిట్ ఫండ్ కంపెనీల్లో, అక్టోబర్ 31న 5 చిట్ ఫండ్ కంపెనీల్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగం అధికారులు సోదాలు నిర్వహించారు.
Advertisement
అయితే, ఈ దాడుల్లో వెలుగు చూసిన అంశాల ఆధారంగా తప్పిదాలకు పాల్పడుతున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని జిల్లా రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్రంలో మొత్తం 18 చోట్ల అధికారులు తనిఖీలు జరిపారు. 2021-22 మధ్య చిట్స్ మొత్తాలను మళ్లించినట్టుగా, ముందస్తు పద్ధతిలో డబ్బులు వసూలు చేసినట్టుగా అధికారులు గుర్తించారు. దీనికి ఐదు శాతం వడ్డీని చెల్లించనట్టు కూడా గుర్తించామని అధికారులు తెలిపారు. చిట్ ఫండ్ చట్టంలో సెక్షన్ 31ని ఉల్లంఘన, పాట పాడుకున్న మంచి వ్యక్తిగా సరిగ్గా సెక్యూరిటీ తీసుకోకపోవడం, కంపెనీలు కూడా సెక్యూరిటీ ఇవ్వకపోవడాన్ని కూడా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఆలస్యంగా చిట్టీలు కట్టిన వారిపై వేసిన పెనాల్టీలకు జీఎస్టీ చెల్లించకపోవడం కూడా తెలిసిందని తెలిపారు.
READ ALSO : అసెంబ్లీ టికెట్ కోసం కేసీఆర్ కాళ్లు పట్టుకున్నాడుగా !