Advertisement
ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరో హీరోయిన్లు సినిమాల్లో నటిస్తూ ఎంతో క్రేజ్ సంపాదించుకుంటున్నారు. అయితే ఆ క్రేజ్ ను ఉపయోగించుకొని కొంతమంది హీరోయిన్లు యాడ్స్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు.. కానీ ఇండస్ట్రీలో కొంతమంది స్టార్ నటులు మాత్రం ఎన్ని కోట్లు ఇచ్చిన ఆ యాడ్ చేయడానికి ససేమిరా అంటున్నారు.. మరి ఆ స్టార్ నటులు ఎవరో.. వారు యాడ్స్ ఒప్పుకోక పోవడానికి కారణం ఏంటో మనం ఇప్పుడు చూద్దాం.. టాలీవుడ్ టాప్ హీరో బాలకృష్ణ ఇంతవరకు ఏ వాణిజ్య ప్రకటనలో నటించలేదు.
Advertisement
ఎన్నో కంపెనీలు ఆయన దగ్గరికి వచ్చినా రిజెక్ట్ చేశారు. జనాలకి ఉపయోగపడే ప్రకటన అయితే ఫ్రీగా చేస్తాను తప్ప డబ్బులు తీసుకొని జనాలకు అబద్ధాలు చెప్పలేం అని తేల్చి చెప్పారట. అలాగే డైలాగ్ కింగ్ మోహన్ బాబు తో యాడ్ చేసేందుకు పలు కార్పొరేట్ కంపెనీలు ముందుకు వచ్చాయి. కానీ మోహన్ బాబు దానికి ఒప్పుకోలేదు. అలాగే కళ్యాణ్ రామ్ కూడా వాణిజ్య ప్రకటనల్లో నటించే ఆఫర్ వచ్చినా సున్నితంగా తిరస్కరించాడట. తాను ఇలాంటి పనులు చేయానని తేల్చి చెప్పారట.
Advertisement
సాయి పల్లవి కూడా ఫెయిర్నెస్ క్రీమ్ లో నటించే ఆఫర్ వచ్చినా, కోట్ల రూపాయలు ఇచ్చినా సరే ఆ పని చేయలేను అంటూ తిరస్కరించిందట. మంచు విష్ణుకు కూడా యాడ్ చేసే అవకాశాలు వచ్చినా వదిలేసుకున్నాడట. మంచు మనోజ్ కూడా ఈ లైన్ లోనే ఉన్నాడు. టాలీవుడ్ టాప్ బ్యూటీ అనుష్క కూడా యాడ్ లో నటించేందుకు అంగీకరించడం లేదట. సాయి ధరమ్ తేజ్ ని యాడ్స్ చేసేందుకు పలు కంపెనీలు ఆఫర్ చేసిన కానీ నాకు ఇష్టం లేదని చెప్పారట సాయిధరమ్ తేజ్.
ALSO READ;
ప్రభాస్ నుంచి రజినీ వరకు.. 2022లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న టాప్ హీరోలు