Advertisement
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్-ఉపాసనల వివాహానికి పదేళ్లు. జూన్ 14, 2012లో వీరి పెళ్లి అతిరథ మహారధుల మధ్య ఘనంగా జరిగింది. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాదితో చరణ్ ఉపాసన వివాహా బంధానికి పదేళ్లు. ఇది ఇలా ఉండగా, వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రితను, చరణ్ కి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారట.
Advertisement
రామ్ చరణ్, ఆశ్రితలకు వివాహం చేయాలని చిరంజీవి, వెంకటేష్ మధ్య మాటలు జరిగాయట. దాదాపు ఈ సంబంధం ఖాయం అయ్యిందట. ఇక రామ్ చరణ్ అభిప్రాయం చిరంజీవి అడగగా నో చెప్పారట. అలాగే తాను కామినేని ఉపాసనను ప్రేమిస్తున్నట్లు, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాట్లు చెప్పాడట.
Advertisement
ఉపాసనతో రామ్ చరణ్ పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని తెలుసుకున్న చిరంజీవి చేసేదేమీ లేక వెంకటేష్ కుటుంబంతో సంబంధం క్యాన్సిల్ చేశాడట.
ఇదే విషయాన్ని వెంకటేష్ తో చెప్పారట. ఇక 2012 జూన్, 14న రాంచరణ్-ఉపాసనల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. మరోవైపు ఆశ్రిత హైదరాబాద్ కి చెందిన బిజినెస్ మాన్ ని ప్రేమించారు. కోరుకున్న వాడికి ఇచ్చి వెంకటేష్ హర్షిత వివాహం చేశారు. భర్తతో పాటు విదేశాల్లో ఉంటున్న ఆశ్రిత హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనుభవిస్తున్నారు. ఇక రామ్ చరణ్-ఉపాసన ఇటీవలే పదవ వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు. అంతేకాదు, రామ్ చరణ్-ఉపాసన త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు.
Also Read: భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!