Advertisement
బొమ్మరిల్లు సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పాల్సిన పని లేదు. భాస్కర్ దర్శకత్వంలో సిద్ధార్థ్, జెనీలియా హీరో హీరోయిన్స్ గా వచ్చిన సినిమా బొమ్మరిల్లు. ప్రకాష్ రాజ్, జయసుధ, కొత్త శ్రీనివాస రావు ఈ సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. తండ్రి కొడుకుల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఆద్యంతం అలరించే ఈ సినిమా వచ్చి దశాబ్దం దాటిపోయినా ఇప్పటికి ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. తండ్రి కొడుకుల మధ్య ప్రతి ఇంట్లో కనిపించని అనుబంధం దాగి ఉంటుంది. ఏ తండ్రికైనా కొడుకు పైన మమకారం ఉంటుంది. కానీ, దాన్ని చూపించే విధానాలు వేరుగానే ఉంటాయి. అయితే.. తండ్రికి కొడుకు పై మితిమీరిన ప్రేమ ఉంటె ఏమి జరుగుతుంది అన్న నేపథ్యంలో సాగిన సినిమా బొమ్మరిల్లు.
Advertisement
దిల్ రాజు ప్రొడక్షన్ లో భాస్కర్ ను డైరెక్టర్ గా పరిచయం చేస్తూ ఈ సినిమా రిలీజ్ చేసారు. ఈ సినిమా భాస్కర్ కి ఎంతలా పేరు తెచ్చిందంటే.. ఆయనను బొమ్మరిల్లు భాస్కర్ అని పిలిచేంతలా. ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈ సినిమా బాగా కనెక్ట్ అయ్యింది. ఈ స్టోరీ రాసుకున్న భాస్కర్ స్టోరీ గురించి దిల్ రాజుకు చెబితే.. ఆయన ఎన్టీఆర్ కు చెబుదాం అని అన్నారట.
Advertisement
దిల్ రాజే స్వయంగా ఎన్టీఆర్ వద్దకు భాస్కర్ ని తీసుకెళ్లారట. భాస్కర్ చెప్పిన స్టోరీ అంతా విన్న ఎన్టీఆర్.. కథ చాలా బాగుందని.. కానీ, దీనిని నాతొ కంటే ఎవరైనా కమింగ్ అప్ హీరోతో చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారట. నేను చేయడం వలన ఈ సినిమా పెద్దగా ఆడదు.. ఎవరైనా కమింగ్ అప్ హీరో అయితేనే ఈ సినిమాకి న్యాయం చేయగలుగుతాడు అని చెప్పారట. దీనితో ఆలోచించుకున్న భాస్కర్, దిల్ రాజు అప్పటికి “నువ్వొస్తానంటే నేనోద్దంటనా” సినిమాతో పాపులర్ ఐన సిద్దు బాగుంటాడని అనుకున్నారు. అనుకున్నట్లే చర్చలు జరిపి అతనితో చర్చలు జరిపి సక్సెస్ అయ్యారు. ఆ తరువాత విడుదల ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యిందో తెలిసిందే.
Read More:
Kotabommali Movie Review: కోటబొమ్మాళి మూవీ రివ్యూ.. శ్రీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్టా..?
ఫైనల్స్ లో ఓడిపోయినా తరువాత.. డ్రెస్సింగ్ రూమ్ లో జరిగిందిదే.. ఎమోషనల్ అయిన రాహుల్ ద్రావిడ్!
ఈ ఐదు రాశుల స్త్రీలు భర్తకి అదృష్ట దేవతలట.. వారిలో మీరున్నారేమో చూడండి!