Advertisement
నటన టాలెంట్ ఉండాలి కానీ ఎక్కడికి వెళ్ళినా ఆఫర్స్ తన్నుకుంటూ వస్తాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా చాలామంది దక్షిణాది నుంచి వెళ్లి స్టార్ నటుడిగా పేరు తెచ్చుకున్న వారు ఉన్నారు. అందులో రాంగోపాల్ వర్మ, జానీ లివర్, ఎల్.వి.ప్రసాద్ హేమామాలిని, శ్రీదేవి, జయప్రద ఇలా చాలా మంది నటులు ఉన్నారు. ఈ నటులలో ఒకరిగా పేరు తెచ్చుకున్న నటి తాళ్లూరి రామేశ్వరి. ఈమె తెలుగు ఆడపిల్ల అయినా హిందీలో మాత్రం స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ఎవరు, వివరాలేంటో తెలుసుకుందాం.. నటించడంలో శిక్షణ తీసుకున్న రామేశ్వరి తన కోర్స్ కంప్లీట్ చేసుకున్న వెంటనే ఆమెకు అనేక ఆఫర్లు వెల్లువెత్తాయి.
Advertisement
స్టార్ నటుడు నసీరుద్దీన్ షా పక్కన “సునయన ” అనే మూవీ చేస్తుండగా రామేశ్వరి కంటికి బలమైన గాయమైంది. దీంతో అమర్దీప్ ఆమెను మూవీ నుంచి తొలగించారు. దీని తర్వాత ఆమెకు అనారోగ్యం రావడంతో “ఆషా” అనే మూవీలో కూడా తనను తానే తప్పుకుంది. కానీ రామేశ్వరి నటన టాలెంట్ చూసిన నిర్మాత మాత్రం ఆమెకు నయం అయ్యే దాకా వెయిట్ చేసి మరీ ఈ సినిమా తీశాడు. అగ్నిపరీక్ష, ఆదత్ సే మజబూర్, దుల్హన్ ఓహి జో, పియా మాన్ బాయే, ప్రతిభ, ద్రోహి, రోష్ని వంటి వరుస సినిమాలతో రామేశ్వరి పేరు బాలీవుడ్ ఇండస్ట్రీలో మార్మోగిపోయింది. అక్కడ మంచి పేరు తెచ్చుకున్న వెంటనే ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో విశ్వనాధ్ దర్శకత్వంలో చంద్రమోహన్ సరసన “సీతామాలక్ష్మి” సినిమా చేసి విజయం సాధించింది.
Advertisement
దీని తర్వాత రామేశ్వరి మళ్లీ తెలుగులో హీరోయిన్ గా నటించలేదు. ఈ సినిమాకు గాను నంది అవార్డులు కూడా గెలుచుకున్నారు రామేశ్వరి. ఈ విధంగా కెరీర్ లో స్టార్ గా దూసుకుపోతున్న తరుణంలో తన చిరకాల మిత్రుడు దీపక్ సేను ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఆమెకు ఇద్దరు పిల్లలు.దింతో నటనకు దూరమైంది. ఆ తర్వాత 2022లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన రామేశ్వరి 2023 లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో నిజం అనే మూవీలో హీరోకు తల్లిగా నటించారు. దీని తర్వాత నీలకంఠ దర్శకత్వంలో “నందనవనం 120 కిలోమీటర్లు, రౌడీ ఫెలో వంటి సినిమాల్లో కాకుండా అమెరికా అమ్మాయి సీరియల్ లో నటించే మేప్పించారు.
ALSO READ: