Advertisement
ప్రతి మాసంలోను ఏవో కొన్ని పండగలు రావడం సహజం. కానీ కార్తీకమాస విశిష్టత ఏమిటంటే, ఇందులో ప్రతిరోజు ఒక పండుగే. జపతపాలతో, ఉపవాసాలతో, దీప దానాలతో, కార్తీక స్నానాలతో, వ్రతాలతో కార్తీకమాసం అంతా దైవం నామస్మరణతో మార్మోగిపోతుంటుంది. అయితే, కార్తీకమాసంలో కొన్ని దేవాలయాలను దర్శించుకుంటే మనం చేసిన పాపాలు తొలగిపోతాయని నిపుణులు అంటున్నారు. ఆ ఆలయాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
Advertisement
మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని నగరంలో కొలువైంది మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. 12 జ్యోతిర్లింగాల్లో ఉజ్జయినికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఇక్కడ పరమేశ్వరుడు పూజలందుకుంటున్నాడని చెబుతారు. ఈ ఆలయాన్ని ఎవరు కట్టారు, ఎప్పుడు కట్టారు అనేది మాత్రం అంతు చిక్కని మిస్టరీ. మొదట ప్రజాపిత బ్రహ్మ స్థాపించాడని పురాణాలు చెబుతున్నాయి. మహా కాల దేవాలయం శాంతి భద్రతల పరిస్థితులను చూసేందుకు 6వ దశాబ్దంలో చండ ప్రద్యోత రాజు యువరాజు కుమారసేనుని నియమించినట్లు చరిత్ర చెబుతుంది. ఇకపోతే, భస్మహారతి ఇది రెండు రకాలుగా నిర్వహిస్తారు. గోమయం పిడకల్ని విభూతిగా మార్చి రెండు మూటల్లో నింపి వాటిని ఒకదానితో మరొకటి తాడనం చేస్తూ ఆ విభూతి లింగం పై పడుతూ ఆ గర్భగుడి నిండా ఆవరిస్తుంది.
Advertisement
మరొకటి స్మశానంలో మొదట కాలిన శవం బూడిదతో ఇచ్చే హారతి, దీనిని నాగసాధువులు నిర్వర్తిస్తారు. దీనిని చూసేందుకు మహిళలని అనుమతించరు. ఈ హారతి సందర్భంగా మోగే బేరీలు, మృదంగనాదాలు, కమ్ముకునే విభూతి, పంచాక్షరి ధ్వని, భస్మాభిషేకం చేస్తున్నప్పుడు చదివే మంత్రాలు, ఇవన్నీ అక్కడున్న వారందరినీ ఓ అలౌకిక ఆధ్యాత్మిక వాతావరణంలోకి తీసుకెళ్లి పోతుంది. శివుడిలో ఐక్యం కావాలనే కోరిక ఉన్నవారు అందుకోసం ముందే ఏర్పాట్లు చేసుకుంటారు. అక్కడే మరణించాలని, శివఖ్యం చెందాలని భావిస్తారు. అలా వారు మరణించిన తర్వాత చితా బస్మాన్ని తీసుకొచ్చి శివుడికి అభిషేకం చేస్తారు. దేవుడిలో పరిపూర్ణంగా ఐక్యం కావాలనే వాంఛ రోజుకి ఒకరికి మాత్రమే నెరవేరుతుంది. కాగా బస్మహారతి చూడాలి అనుకుంటే మాత్రం ముందుగానే ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కాశీని చూసి చనిపోతే ఆత్మ శాంతిస్తుందని పెద్దలు కూడా చెబుతారు.
READ ALSO : T20 WC 2022 : టీమిండియాను దారుణంగా అవమానించిన గిన్నిస్ రికార్డ్స్