Advertisement
నందమూరి తారక రామారావు… రెండవ భార్యనే లక్ష్మీపార్వతి. ఈమె ప్రస్తుతం వైసీపీ పార్టీలో తెలుగు అకాడమీ చైర్మన్ గా పని చేస్తున్నారు. లక్ష్మీపార్వతి.. ఎన్టీఆర్ ను పెళ్లి చేసుకునే ముందే వేరొకరికి భార్య.
Advertisement
ఆమె మొదటి భర్త పేరు వీరగ్రంధం వెంకట సుబ్బారావు. ఆయన హారి కలలో ప్రసిద్ధుడు. హిందూ మతం కలుషితం అవకుండా ఖండాలు దాటి హరి కళ ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చాడు.
అయితే వీర గ్రంధం కు కూడా లక్ష్మీ పార్వతి రెండో భార్యనే కావడం విశేషం. ఆయన మొదటి భార్య బిడ్డ పుట్టిన వెంటనే మరణించడంతో పెద్దలు లక్ష్మీపార్వతి తో వివాహం జరిపించారు. లక్ష్మీపార్వతి సంస్కృతంలో డిగ్రీ చేసింది. పెళ్లయిన తర్వాత లక్ష్మీపార్వతి ఎమ్మెల్యే చదువుతానంటే…ఆమె భర్త నాగార్జున యూనివర్సిటీ లో చేర్పించారు. అంతేకాకుండా ఒక కళాకారుడు రాజకీయాల్లోకి వచ్చే సీఎం అయితే కల బ్రతుకుతుంది అని భావించిన సుబ్బారావు టీడీపీలో చేరితే ఆ పార్టీ తరపున ప్రచారం కూడా చేయడం మొదలుపెట్టారు.
Advertisement
ఇక సుబ్బారావు ఓ సందర్భంలో తన భార్య లక్ష్మీపార్వతి తో కలిసి అమెరికాకు వెళ్లి హరికథ చెప్పారు. ఈ విషయం ఎన్టీఆర్కు తెలిసి వారిద్దరిని పిలిపించుకొని అభినందించారు. అంతేకాకుండా సుబ్బారావు కళాకారుల కోసం వీరగ్రంధం కళాక్షేత్రం అనే సంస్థను స్థాపించాడు. దాని కోసం ఎన్టీఆర్ కొంత భూమి ఇవ్వగా… ఆ భూమి లక్ష్మీపార్వతి పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. కానీ ఎన్టీఆర్ మరణానంతరం.. ఈ భూమి విషయం పై కొంతకాలం మీ ఇద్దరి మధ్య గొడవలు కూడా జరిగాయి.
Also Read:
ప్రయాణాలు చేసేటప్పుడు వాంతులు ఎందుకు వస్తాయి..ఏ వయస్సు వారికి వస్తాయి ?
ఇండియాలోనే అత్యంత రిస్క్ తో కూడుకున్న ఈ 5ప్రభుత్వ ఉద్యోగాల గురించి ఎంతమందికి తెలుసు?