Advertisement
ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు, ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు కాదు, తమ అభిమానులు ఇబ్బందులు ఉన్నారంటే, కొంతమంది హీరోలు స్పందిస్తారు. తమకు తోచిన విధంగా సహాయం చేస్తారు. అయితే ఇలా సహాయం చేయడంలో నందమూరి ఫ్యామిలీ హీరోలు ఎప్పుడూ ముందే ఉంటారు. అంతేకాదు నందమూరి ఫ్యామిలీ ఎప్పుడూ కూడా తమ క్షేమం కంటే ఇండస్ట్రీ క్షేమం కోరుకుంటుంది. అసలు విషయానికి వెళితే, ఈ కాలంలో ఒక్క హిట్ పడితే చాలు ముక్కు, మొహం తెలియని హీరో కూడా మరుసటి సినిమాకే రేట్లు పెంచేస్తున్నాడు. అయితే ఎన్టీఆర్ ఎప్పుడు హిట్ వస్తే అప్పుడు రేటు పెంచేందుకు ఇష్టపడేవారు కాదట.
Advertisement
పక్కన ఉన్నవారు ఎవరైనా రేటు పెంచమని అడిగితే, ఏంటి బ్రదర్ అలా అంటున్నారు, మనతో సినిమా తీసిన నిర్మాతకు నాలుగు రూపాయలు వస్తే తింటాడు. వాళ్లు వాళ్ళ పెళ్ళాం, బిడ్డలు చేసుకున్న అదృష్టం అది. ఎక్కడికి పోతాడు, మళ్లీ మనతోనే సినిమా తీస్తాడు కదా, మనం రేటు పెంచమని, రెమ్యునరేషన్ ఎక్కువ ఇవ్వమని అడగడం సరికాదని అనేవారట. ఇక ఎన్టీఆర్ లక్షణమే ఆయన తనయుడు బాలయ్యకు కూడా వచ్చింది. బాలయ్య రేంజ్ హీరోలు ఒక్కో సినిమాకు రూ. 50 కోట్లు, 60 కోట్లు అంటున్నారు. అయితే బాలయ్య అఖండ బ్లాక్ బస్టర్ అయిన పెంచింది మాత్రం రూ.2 కోట్లే. ఇప్పుడు బాలయ్య రెమ్యూనరేషన్ రూ. 12 కోట్ల రేంజ్ లో నడుస్తోంది.
Advertisement
నిర్మాత ఎంత ఇస్తానన్నా కూడా ఓకే చెప్పే మనస్తత్వం బాలయ్యది. ఇక ఇప్పుడు అదే నందమూరి వంశంలో మూడవ తరం హీరోగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ సైతం వరుసగా 6 హిట్లు పడిన రమ్యునరేషన్ పెంచలేదు. ఆర్ ఆర్ ఆర్ కోసం ఎన్నో సినిమాలు వదులుకున్న ఎన్టీఆర్, ఆ సినిమాకు తీసుకున్న రెమ్యూనరేషన్ రూ. 45 కోట్లే. ఇప్పుడు ఎన్టీఆర్ రేంజ్ హీరోలు రూ. 60-70 కోట్లు అంటున్న, ఎన్టీఆర్ రూ.40-45 కోట్ల రేషియో లోనే తీసుకుంటున్నాడు. ఎన్టీఆర్ కూడా నిర్మాతలను ఇబ్బంది పెట్టేందుకు అసలు ఇష్టపడడు. తన సినిమాల వల్ల నిర్మాతలు నష్టపోవడం ఎన్టీఆర్ కు అస్సలు నచ్చదు. ఏదేమైనా నిర్మాతలు, ఇండస్ట్రీ శ్రేయస్సును కాంక్షించే విషయంలో నందమూరి హీరోలకు మించిన హీరోలు ఉండరనే చెప్పాలి.
Read also: యాంకర్ సుమ ఇంటిని ఏయే సినిమాల షూటింగ్‌లకు ఉపయోగించారో తెలుసా..?