Advertisement
కొంతమంది ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అతిగా ఆలోచించడం వలన నష్టాలను ఎదుర్కోవాలి. అతిగా ఆలోచిస్తున్నారా..? అయితే ఇలా చేయండి. అతిగా ఆలోచిస్తే ఆ సమయంలో ఏదైనా పనిలో పడిపోవడం మంచిది. వేరే పనిలో నిమగ్నం అవ్వడం వలన ఆలోచన బాగా తగ్గుతుంది. మీ ఆలోచనలని వర్తమానంలో ఉంచాలి. గతం గురించి వదిలేయాలి. భవిష్యత్తుకు సిద్ధంగా ఉండాలి, అతిగా ఆలోచించడం వలన మనకు వచ్చేదేమీ కూడా లేదు అదుపులో లేని విషయాల గురించి ఆలోచించడం వలన ఎలాంటి ఉపయోగం లేదు. చేతిలో లేని వాటిని వదిలేయడమే మంచిది. ఈ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకొని ఆచరించారంటే ఎక్కువ ఆలోచించకుండా ఉంటారు.
Advertisement
Advertisement
ఆలోచనలు వలన మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. ఎమోషన్స్ మిక్స్ అవుతాయి. ఇది కోపం, చిరాకు వద్దకు చేరినప్పుడు వెనక్కి వచ్చేయడం మంచిది. అదే విధంగా కొంతమంది ఎప్పుడు పక్కన వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు. తమని వారితో పోల్చుకుంటూ ఉంటారు. అది అసలు మంచిది కాదు. ఎదుటి వాళ్ళతో మిమ్మల్ని ఎప్పుడూ కంపేర్ చేసుకోవద్దు. ప్రతి ఒక్కరి జీవితం వారు తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.
Also read:
సమస్య వచ్చినప్పుడు వేగంగా పరిష్కరించడానికి మార్గాన్ని అన్వేషించాలి. అలాగే ఆలోచనలపై నియంత్రణ ఉండాలి అంటే ధ్యానం చాలా ముఖ్యం. దీని వలన శరీరం మనసుకి ప్రశాంతత ఉంటుంది. అనవసరమైన విషయాలకు దూరంగా ఉండాలి. మీరు చేస్తున్న పని మీకు నచ్చే విధంగా ఉండాలి. మీ గొప్పతనం గురించి మీరు గుర్తు చేసుకోండి. అప్పుడప్పుడు మిమ్మల్ని మీరు మెచ్చుకుంటూ ఉండండి. మీ చేతిలో లేని వాటిని గురించి మాత్రం ఆలోచించొద్దు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!