Advertisement
సక్సెస్ అనేది అంత ఈజీగా దొరికేది కాదు. కానీ, ప్రతి ఒక్కరు తమ జీవితంలో సక్సెస్ అవ్వాలని కోరుకుంటూనే ఉంటారు. అలవాట్లు, నిబద్ధత, క్రమశిక్షణ, ఎటువంటి పరిస్థితిని అయినా ధైర్యంగా ఎదుర్కోగలగడం వంటివి సక్సెస్ అవ్వడానికి దోహదం చేస్తాయి. సవాళ్లకు భయపడి, కంఫర్ట్ జోన్ లోనే ఉండిపోవాలని అనుకునేవారు సక్సెస్ అవ్వడం అనేది జరగదు. మనం సక్సెస్ అవ్వాలంటే ఎంతో నిబద్ధత కలిగి.. తలపెట్టిన పనిపై నిరంతరం ఫోకస్ చెయ్యాలి. అది కుదరకపోతే సక్సెస్ అవ్వలేరు. కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ లైఫ్ లో సక్సెస్ అవ్వనివ్వకుండా చేస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Advertisement
మార్పు కోరుకోకపోవడం:
జీవితం అన్నాక అనేక ఒడిదుడుకులు సహజం. మార్పు లేని సమాజం ఉండదు. సమాజంలో ఉన్న మార్పులకు అనుగుణంగా మనం కూడా మారుతూ ఉండాలి. ప్రస్తుతం ప్రశాంతంగానే ఉన్నాం కదా.. రిస్క్ ఎందుకు? అని ఆలోచిస్తే.. ఎవ్వరూ సక్సెస్ అవ్వలేరు.
పనుల వాయిదా:
కాసేపాగి చేద్దాం, తొందరేముందిలే అనుకుంటూ పనులను వాయిదా వేయడం కూడా మంచిది కాదు. రేపు, ఎల్లుండి అనుకుంటూ పనులను వాయిదా వేసుకునే వారు కూడా సక్సెస్ అవ్వలేరు.
స్పష్టమైన లక్ష్యం లేకుండటం:
మీకేం కావాలి?, మీరేం చెయ్యాలి? అనే విషయంలో మీకు స్పష్టత ఉండాలి. లక్ష్యం ఉంటేనే మార్గం కనిపిస్తుంది. ముందు మీకేమి కావాలో తేల్చుకోలేకపోతే మీకు సక్సెస్ రాదు.
Advertisement
సెల్ఫ్ – డెవలప్మెంట్ ను పక్కన పెట్టడం:
గురువింద గింజ తన తప్పెరగదు అన్నట్లు.. ముందు మీ తప్పులను, లోపాలను మీరు గుర్తించాలి. మీ లోపాలను సరిచేసుకుంటూ మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవాలి. తప్పులనుంచి నేర్చుకుంటూ మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవాలి.
సవాళ్లకు భయపడటం:
ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కోగలిగే నేర్పు ఉండాలి. ఓడిపోతామేమో అన్న భయంతో సవాళ్ళను ఎదుర్కోలేకపోతే జీవితంలో రాణించలేరు.
మీ వైఫల్యాలకు ఇతరులని బాధ్యుల్ని చేయడం:
మీరు ఒకవేళ ఓడిపోతే.. మీ ఓటమి బాధ్యత మీరే తీసుకోవాలి. బాధ్యతల నుంచి తప్పించుకోవడం కోసం ఇతరులను నిందించడం కూడా తప్పే. దానివల్ల మీరు జీవితంలో ఎదుగుదల సాధించలేరు.
చుట్టూ వాతావరణం:
మీ చుట్టూ ఉండే వాతావరణం ప్రతికూలంగా ఉంటె అది మీ మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. నిరాశావాదంలో మునిగిపోతే.. గెలుపు వైపు దారులు కనిపించవు. అందుకే మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడంతో పాటు.. మీ చుట్టూ పరిస్థితులను కూడా గమనించుకోవాలి.
Read More: