Advertisement
ఒకప్పుడు టాలీవుడ్ కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్నారు సుధాకర్. సీనియర్ నటుడు సుధాకర్, చిరంజీవి మంచి ఫ్రెండ్స్. ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుధాకర్ షాకింగ్ విషయాలను వెల్లడించారు. పవన్ కళ్యాణ్ నన్ను అన్నయ్య అని పిలిచేవారని, నా భార్యను వదినా అని పిలిచేవారని ఎంతో ఆప్యాయంగా మాట్లాడే వారని సుధాకర్ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ అంటే నాకు కూడా చాలా ఇష్టం అని చిరంజీవి పై ఎంత ప్రేమ ఉందో పవన్ కళ్యాణ్ కూడా అంతే ఇష్టం అని అన్నారు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఎన్నికై డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్ కి ఫోన్ చేసి అభినందించానని సుధాకర్ చెప్పారు.
Advertisement
Advertisement
తను శుభాకాంక్షలు చెప్పడంతో పవన్ చాలా సంతోషించారని అన్నారు. పవన్ కళ్యాణ్ సుధాకర్ కాంబినేషన్లో మూడు సినిమాలు అయితే వచ్చాయి. గోకులంలో సీత, సుస్వాగతం, ఖుషి సినిమాల్లో ఇద్దరు కలిసి నటించారు. ఈ సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ ని అందుకుంది. సంక్రాంతి సినిమా తర్వాత తను సినిమాల్లో ఎక్కువగా నటించలేదని ఆయన చెప్పారు. అనారోగ్య సమస్యల వలన సినిమాలకి దూరమయ్యానని అన్నారు.
Also read:
సుధాకర్ కొడుకు పలు సినిమాల్లో నటిస్తూ కెరీర్ లో బిజీగా ఉన్నారు. సుధాకర్ కొడుకు బెన్నీకి ఆశించిన స్థాయిలో బ్రేక్ అయితే రాలేదు. చిరంజీవి అంటే ఎంత ప్రేమ పవన్ కళ్యాణ్ అంటే అంటే ఇష్టమని ఆయన చెప్పడం ప్రస్తుతం వైరల్ అవుతోంది. సుధాకర్ వయసు 65 సంవత్సరాలు, ఈమధ్య ఆయన ఇంటర్వ్యూలని కూడా ఎక్కువగా ఇవ్వట్లేదు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!