Advertisement
Gaalodu Telugu Movie Review in Telugu: బుల్లితెర ఆల్ రౌండర్ గా వెలుగొందుతున్న సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన సినిమానే ‘గాలోడు’. ఇందులో గెహనా సిప్పి హీరోయిన్ గా నటించింది. రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల తెరకెక్కించిన ఈ మూవీని సాంస్కృతి ఫిలింస్ బ్యానర్ పై ఆయనే స్వయంగా నిర్మించారు. బీమ్స్ దీనికి సంగీతం అందించారు. సప్తగిరి, షకలక శంకర్, పృథ్వి, సత్య కృష్ణ ఈ సినిమాలో కీలక పాత్రలో పోషించారు. ఇక ఈ సినిమా ఇవాళ రిలీజ్ కాగా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Advertisement
Gaalodu Telugu Movie Story కథ మరియు వివరణ:
రాజు (సుడిగాలి సుదీర్) పల్లెటూరి కుర్రాడు. ఊరిలో అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. ఓ రోజు పేకాటలో సర్పంచ్ కొడుకు పై చేయి చేసుకోవడంతో అతను చనిపోతాడు. దాంతో ఊరు వదిలిపెట్టి రాజు హైదరాబాద్ పారిపోతాడు. అక్కడ కాలేజీ స్టూడెంట్ శుక్లా (గేహనా సిప్పి) తో పరిచయమవుతుంది. ఆకతాయిల నుండి తనను కాపాడిన రాజును తన తండ్రికి పరిచయం చేసి డ్రైవర్ గా ఉద్యోగంలో పెట్టిస్తుంది శుక్లా. అలా మొదలైన వారి పరిచయం ప్రేమకు దారితీసింది. ఇదే సమయంలో పల్లెటూరిలో హత్య చేసి సిటీకి వచ్చిన రాజును వెతుక్కుంటూ పోలీసులు వస్తారు. హత్య కేసులో శిక్ష పడిన రాజు, జైలు నుండి ఎలా బయటపడ్డాడు? తన నిర్దోషిత్వాన్ని ఎలా నిరూపించుకున్నాడు? ఈ విషయంలో లాయర్ విజయభాస్కర్ (సప్తగిరి) అతనికి ఎలాంటి సాయం చేశాడు? అన్నదే మిగతా కథ.
Advertisement
నటీనటుల విషయానికి వస్తే, కమెడియన్ ఇమేజ్ ఉన్న సుడిగాలి సుదీర్ కు ఇది నప్పే పాత్ర కాదు. హీరోయిజాన్ని ఎలివేట్ చేయాలనే తపన తప్పితే దర్శకుడికి మరో ఆలోచన ఉన్నట్టుగా కనిపించదు. హీరోయిన్ నుండి ప్రతి సన్నివేశాన్ని బిల్డప్ షాట్స్ తో నింపేశారు. వినోదాన్ని పంచాల్సిన చోట కూడా హీరోయిజాన్నే చూపించారు. కానీ పెంచిన తల్లిదండ్రులు, నానమ్మ మీద గౌరవం లేని గాలొడి పాత్రలో సుదీర్ ను ఊహించుకోవడం కష్టమే. సెకండ్ హాఫ్ లో ఆ పాత్రలో రియలైజేషన్ ను చూపించిన, అదేమంతా ఆకట్టుకునే విధంగా లేదు. ‘చోర్ బజార్’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన గెహనా సిప్పి తెరమీద చూడటానికి బాగానే ఉంది. దాంతో పాటలు, వాటి లొకేషన్స్ కాస్తంత చూడదగ్గవిగా అనిపిస్తాయి.
Gaalodu Telugu Movie Review in Telugu ప్లస్ పాయింట్స్:
సుడిగాలి సుదీర్ నటన,
యాక్షన్ సీక్వెన్స్ లు,
బ్యాక్గ్రౌండ్ స్కోర్,
కామెడీ
మైనస్ పాయింట్స్:
నెమ్మదించిన స్క్రీన్ ప్లే,
లీడ్ పెయిర్ మధ్య లవ్ ట్రాక్,
లాజిక్ లేని సన్నివేశాలు
రేటింగ్: 2/5.
READ ALSO : ప్రేమ పెళ్లి చేసుకుందని.. అత్తగారింటి నుంచి కుమార్తెను కిడ్నాప్ చేసి, గుండుకొట్టించి !