Advertisement
సుకేశ్ చంద్రశేఖర్.. బాలీవుడ్ ముద్దుగుమ్మలను ఈడీ ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి. బడా లీడర్స్ తోనూ డీలింగ్స్ ఉన్నాయి. కానీ, చివరకు తీహార్ జైల్లో చిప్పకూడు తింటున్నాడు. తన పరిచయాలే తనను ముంచేశాయని ఇప్పుడు ఆవేదన చెందుతున్నాడు. ఇటీవల ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు లేఖ రాసి ఆప్ నేత సత్యేంద్ర జైన్ పై తీవ్ర ఆరోపణలు చేసిన సుకేశ్.. తాజాగా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను టార్గెట్ చేశాడు. వీళ్లిద్దరి మధ్య జరిగిన డీలింగ్స్ ను బయటపెట్టాడు.
Advertisement
పార్టీ ఫండ్ కోసం 2016లో రూ.500 కోట్లు సమకూర్చాలని కేజ్రీవాల్ ఒత్తిడి తీసుకొచ్చారని లేఖలో ఆరోపించాడు సుకేశ్. దానికి ప్రతిఫలంగా కర్ణాటక పార్టీలో కీలక స్థానం ఆఫర్ చేశారని తెలిపాడు. తనకు రాజ్యసభ సీటు ఆశచూపి కేజ్రీవాల్ రూ.50 కోట్లు తీసుకున్నారని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ కు సుకేశ్ మరో లేఖ రాశాడు.
తాను మోసగాడినైతే ఢిల్లీ సీఎం తనను మించిన మహా మోసగాడు అంటూ ఫైర్ అయ్యాడు సుకేశ్. 2019లో సత్యేంద్ర జైన్, ఆయన కార్యదర్శి, జైల్లో ఉన్న ఆయన స్నేహితుడు సుశీల్ ముగ్గురు కలిసి ప్రతి నెలా రూ.2 కోట్లు ఇవ్వాలంటూ తనను బెదిరించినట్లు ఆరోపణలు చేశాడు. ఆనాటి జైళ్ల శాఖ డీజీ సందీప్ గోయల్‌కు కూడా ప్రతి నెలా రూ.1.5 కోట్లు ఇవ్వాలని చెప్పారని పేర్కొన్నాడు. ఒత్తిళ్లు పెరిగిన క్రమంలో కోల్ కతాలోని తన అనుచరుడు చతుర్వేది ద్వారా సత్యేంద్ర జైన్ కు రూ.10 కోట్లు, జైళ్ల డీజీ సందీప్ గోయల్ కు రూ.12.5 కోట్లు అందజేశానని చెప్పాడు. సుకేశ్ రాసిన ఈ లేఖ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Advertisement
సుకేశ్ చంద్ర శేఖర్ కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన వ్యక్తి. విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి 17 సంవత్సరాల నుంచి అందర్నీ మోసగించడం ప్రారంభించాడు. రాజకీయ, వ్యాపారవేత్తలు, బాలీవుడ్ ప్రముఖుల వరకు చాలామందిని మోసం చేశాడు. అలా 2007లో బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి వంద మందిని ముంచాడు.ఆ కేసులో అరెస్టు అయి జైలుకు కూడా వెళ్ళాడు. ఇతనిపై దాదాపు 30కి పైగా కేసులు నమోదయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కొడుకునని.. వైఎస్ఆర్ కి మేనల్లుడిని అని చెప్పుకుని చాలా మందిని మోసం చేశాడు.ఆ తర్వాత బాలీవుడ్ లో లీనా పాల్ తో సాన్నిహిత్యం ఏర్పడింది. అయితే.. జైల్లో ఉన్న సుఖేష్ రాన్ బాక్సీ మాజీ ప్రమోటర్లను జైలు నుంచి బయటకు తీసుకువస్తానని చెప్పి వారి భార్యల నుంచి దాదాపు 200 కోట్లకు పైగా తీసుకొని మోసం చేశాడు. అదే సమయంలో హీరోయిన్ జాక్వెలిన్ కు దగ్గరయ్యాడు. ఆమెకు కోట్ల విలువ చేసే బహుమతులను ఇచ్చాడు. ఇలా ఎంతో మందిని మోసం చేసి కోట్ల రూపాయలు పోగు చేసుకున్నాడు. విలాసవంతమైన జీవితం గడిపాడు. చివరకు జైల్లో మగ్గుతున్నాడు.