Advertisement
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమా రాబోతుంది. ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్లు దర్శకుడు సుకుమార్ పరిస్థితి అలా మారిపోయింది. సుకుమార్ ఏదో అనుకుంటే ఏదో అయింది. పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ లో పేరు సంపాదించాలని చూసిన ఆయనకు గట్టి దెబ్బ తగిలింది. దీనికి కారణం వైసీపీకి అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతుగా నిలవడమే మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్ కు అండగా ఉంటే అల్లు అర్జున్ మాత్రం వైసిపి అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. నంద్యాల వైసిపి అభ్యర్థి తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కి మద్దతు ప్రకటించడమే కాకుండా అక్కడికి వెళ్లి మరీ ప్రచారం చేశారు.
Advertisement
దీంతో మెగా అభిమానులకు బన్నీ బద్ధ శత్రువు అయిపోయారు. మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న పరిస్థితి ఏర్పడింది. పుష్ప టు పై మెగా అభిమానులు ప్రభావం కచ్చితంగా పడుతుందని తెలుస్తోంది. ఇప్పటికీ సినిమా గురించి మెగా అభిమానులు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. పుష్ప టు మూవీ కోసం భారీగా ఖర్చు చేసిన విషయం తెలిసిందే.. సినిమా కలెక్షన్లకు రెండు తెలుగు రాష్ట్రాలు చాలా ముఖ్యం కావడంతో నిర్మాతల్లో ఇప్పుడు కొత్త భయం మొదలైంది.
Advertisement
Also read:
సినిమాపై నెగటివ్ టాక్ వస్తే పరిస్థితి తారుమారు అయ్యే అవకాశాలు ఉన్నాయని భావించిన చిత్ర యూనిట్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ క్రమంలో సుకుమార్ వేడి తగ్గే వరకు సినిమా రిలీజ్ చేయకూడదని డిసైడ్ అయ్యారట. ముందు ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఇప్పుడు డిసెంబర్ కి వాయిదా వేసినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. న్యూస్ ప్రకారం డిసెంబర్ కి మూవీని వాయిదా వేసినట్లు వార్త వస్తోంది దీంతో బన్నీ కెరీర్ కాపాడడానికి సుకుమార్ ఇలా చేస్తున్నారని అందరూ చర్చించుకుంటున్నారు. మరి ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది చూడాలి.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!