Advertisement
సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు స్వచ్ఛ రైలు మిషన్ బ్రాండ్ అంబాసిడర్ బిందేశ్వర్ పాఠక్ కన్నుమూశారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సులభ్ ఇంటర్నేషనల్ సెంట్రల్ లో ఉదయం జెండా ఎగరవేసిన ఆయన.. ఆ తరువాత అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను ఢిల్లీ ఎయిమ్స్ కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
Advertisement
బీహార్ లోని వైశాలి జిల్లా రాంపూర్ బాఘేల్ గ్రామంలో జన్మించారు పాఠక్. 1964లో బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి సోషియాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పాట్నా విశ్వవిద్యాలయం నుంచి సోషియాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పాట్నా విశ్వవిద్యాలయం నుంచి 1980లో మాస్టర్స్ డిగ్రీని, 1985లో పీహెచ్డీ పూర్తి చేశాడు. దేశంలోని పారిశుధ్య సమస్యలను పరిష్కిరంచే లక్ష్యంతో 1970లో సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ను స్థాపించారు.
Advertisement
1991లో మాన్యువల్ స్కావెంజర్లను విముక్తి చేయడం.. పునరావాసం కల్పించడం కోసం పోర్ ఫ్లష్ టాయిలెట్ టెక్నాలజీ అందించారు. పర్యావరణ కాలుష్యాన్ని నివారించడం కోసం పాఠక్ చేసిన కృషికి భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును అందించింది. అదేవిధంగా పారిశుధ్యం, పరిశుభ్రత రంగంలో ఆక్ష్న చేసిన కృషికి వివిధ జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయి. అప్పటి కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ఆధ్వర్యంలో రైలు ప్రాంగణంలో పరిశుభ్రతను పెంపొందించే లక్ష్యంతో 2016లో బిందేశ్వర్ స్వచ్ఛ రైలు మిషన్ కి బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యారు.
Also Read :