Advertisement
కొంతకాలంగా రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు ఎక్కువయ్యాయి ఇది మంచి పద్ధతి కాదని సీనియర్ నటుడు సుమన్ అభిప్రాయపడ్డారు. రాజకీయాలు వేరు సినిమాలు వేరు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సుమన్ అన్నారు. సినిమా పరిశ్రమకు చెందిన చాలామంది రాజకీయాల్లో ఉన్నత స్థానాలకు చేరుకోవడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్, రోజా వంటి నాయకులు మీద అడ్డగోలుగా వ్యాఖ్యలు చేయడం బాధ కలిగించిందని ఆయన అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలు సందర్భంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి చాలామంది దారుణంగా మాట్లాడారని ఆయన గుర్తు చేశారు పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడటం సరికాదని.. 30 మంది మూడు పెళ్లిళ్లు చేసుకోవచ్చు అది వాళ్ళ వ్యక్తిగత విషయమని ఆయన అన్నారు.
Advertisement
నీకేంటి బాధ వాళ్ళు ఏమైనా కంప్లైంట్ చేశారా..? వాళ్ళు మిమ్మల్ని ఏమైనా సహాయం అడిగారా మీరు పొలిటికల్ గా మాట్లాడితే పర్లేదు కానీ వ్యక్తిగతంగా వెళ్లడం మంచిది కాదని ఆయన అన్నారు. పార్టీలో ఉన్న వాళ్లకు కూడా చాలా వ్యక్తిగత విషయాలు ఉంటాయి వారికి కూడా చాలామంది భార్యలు ఉండి ఉండొచ్చు. అదే విషయాన్ని ఎదుటి వాళ్ళ ముందు మాట్లాడితే ఎలా ఉంటుంది అని సుమన్ ప్రశ్నించారు. రోజా పైన పలు వ్యాఖ్యలు చేయడం బాధ కలిగించిందని.. రోజా గురించి కూడా కొంతమంది కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారని ఒక మహిళా సినిమా పరిశ్రమంలో రాణించాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుందని అన్నారు. ఎన్నో కాంప్రమైజ్ అవ్వాలి. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఆవిడ బోల్డ్ గా మాట్లాడుతుంది. అందరిలా సైలెంట్ గా ఉండాలంటే ఎలా..? మహిళల్ని గౌరవించాలి అని అన్నారు.
Advertisement
ఎన్టీఆర్ జయంతిలో పాల్గొని రజనీకాంత్ చంద్రబాబు నాయుడు విజయం గురించి ప్రశంసించడం పట్ల కొన్ని పార్టీ నాయకులు విమర్శలు చేయడాన్ని సుమన్ తప్పుపట్టారు రజినీకాంత్ గారు చాలా రియాలిటీ పర్సన్. ఆయన ఎప్పుడూ నిజాన్ని మాట్లాడతారు ఎవరిని అనవసరంగా పొగడరు. ఆయన ఎక్కడి నుండి వచ్చారో మర్చిపోరు ఆయన ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో పాల్గొని చంద్రబాబు విషయం గురించి మాట్లాడితే చాలామంది అడ్డగోలుగా వ్యాఖ్యానించారు. ఇది సరైన పద్ధతి కాదు అని అన్నారు. తాను రాజకీయాల్లో లేకపోయినా శని పరిశ్రమకు చెందిన చాలామంది రాజకీయాల్లో రాణిస్తున్నారు అని సుమన్ అన్నారు. వాళ్ళందరూ మంచి పొజిషన్ లోకి రావాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!