Advertisement
ఐపీఎల్ మినీ వేలానికి గడువు ముంచుకొస్తుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023 కోసం ఆటగాళ్ల మినీ వేలం ప్రక్రియ డిసెంబర్ 23న కొచ్చిలో జరగనుంది. ఈ క్రమంలో ప్రాంచైజీలు ఆటగాళ్లను మార్చుకునే పనిలో బిజీగా ఉన్నాయి. రోజులు దగ్గర పడుతున్న కొద్ది ఆసక్తికరంగా మారుతుంది. వేలం బరిలో నిలిచే విదేశీ స్టార్ ఆటగాళ్లను ఏ ఫ్రాంచైజీలు చేజిక్కించుకుంటాయోనని అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. వేలానికి ఇంకా నెలరోజుల సమయం ఉన్నప్పటికీ అభిమానులు జట్టుపై కొన్ని అంచనాలు పెట్టుకోవడం గమనార్హం.
Advertisement
read also : పంత్ ఇకనైనా కొవ్వు తగ్గించుకో.. ధోనిని చూసి నేర్చుకో !
సామ్ కర్రన్, బెన్ స్టోక్స్, సికిందర్ రజా, కేమరూన్ గ్రీన్, అలెక్స్ హేల్స్, ఆదిల్ రషీద్ ను తమ తమ జట్లలో ఉండాలని అన్ని ఫ్రాంచైజీలు, అభిమానులు కోరుకుంటున్నారు. అయితే 10 ఫ్రాంచైజీల్లో ఎక్కువ పర్స్ బ్యాలెన్స్ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్. ఈ ఫ్రాంచైజీ వద్ద సుమారు 42.25 కోట్ల రూపాయలు ఉన్నాయి. దీంతో ఈ డబ్బును ఉపయోగించి, ఎక్కువమంది స్టార్ ఆటగాళ్లను సొంతం చేసుకునే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
Advertisement
ఎస్ ఆర్ హెచ్ ముఖ్యంగా బెన్ స్టాక్స్ దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయన్న వార్తలు గుప్పుమంటున్నాయి. అంతేకాకుండా స్టోక్స్ కే కెప్టెన్సీ పగ్గాలు ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. ఫ్రాంచైజీ వద్ద ఉన్న డబ్బును చూసుకుంటే, బెన్ స్టాక్స్ తో పాటు అలెక్స్ హేల్స్, కెమరూన్ గ్రీన్ లను దక్కించుకునేటట్టు కనిపిస్తోంది. కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, జగదీశ సుచిత్, రోమారియో షేపర్డ్ ప్రియమ్ గార్గ్, రవికుమార్ సమర్ధ్, సౌరబ్ దుబే, సీన్ అబౌట్, శశాంక్ సింగ్, సుశాంత్ మిశ్రా, విష్ణు వినోద్, శ్రేయస్ గోపాల్ లను సన్రైజర్స్ వదులుకుంది. ముఖ్యంగా సన్ రైజర్స్ ఆ జట్టు కెప్టెన్ విలియమ్సన్ ను తప్పించడం అభిమానులకు షాక్ కు గురి చేసింది. విలియమ్సన్ ను విడుదల చేయడం వల్ల సన్రైజర్స్ కు రూ. 14 కోట్లు మిగిలినట్టయింది. విలియమ్సన్ వైఫల్యం సన్రైజర్స్ పై తీవ్ర ప్రభావం చూపింది.
READ ALSO : సంజూకు మరోసారి అన్యాయం..సౌత్ ఇండియాకు BCCI ఛాన్స్ ఇవ్వదా ?