Advertisement
Super star Krishna Death: టాలీవుడ్ లో ఒక తరం ముగిసింది. ఒక పద్ధతికి, ఒక మాటకు, ఒక ఒరవడికి కట్టుబడి. ముందుకు సాగిన తరానికి చివరి ప్రతినిధిగా నిలిచిన సూపర్ స్టార్ కృష్ణ ఇవాళ మరణించారు. ఉదయం 4 గంటల ప్రాంతంలో సూపర్ స్టార్ కృష్ణ మరణించారు. నటుడు, నిర్మాత, దర్శకుడు, స్టూడియో అధినేత, అన్నింటికీ మించి దార్శనికుడు, సాహసి, ఓ మంచి వారసత్వాన్ని టాలీవుడ్ కు వదిలి వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలోనే సూపర్ స్టార్ కృష్ణకు పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. అయితే, ఎన్నో గొప్ప సినిమాలు చేసిన సూపర్ స్టార్ కృష్ణ, కొన్ని కోరికలు తీరకుండానే మరణించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Advertisement
సూపర్ స్టార్ కృష్ణ జీవితంలోను కొన్ని తీరని కోరికలు ఉన్నాయి. కృష్ణ అనుకుంటే అది జరిగి తీరుతుంది. కాకపోతే, కొన్ని విషయాల్లో ఆయనకు నిరాశ ఎదురయింది. చివరికి తీరని కోరికగా మిగిలిపోయింది. ‘ఛత్రపతి శివాజీ’ కథ అంటే కృష్ణకు చాలా ఇష్టం. ‘అల్లూరి సీతారామరాజు’ సమయంలోనే ఈ స్క్రిప్ట్ పై కొంత వర్క్ చేశారు. అయితే ఆ కథలో సున్నితమైన విషయాలు చాలా ఉన్నాయని, వాటి వల్ల మత ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉందని గ్రహించిన కృష్ణ ఆ కథని పక్కన పెట్టేశారు.
Advertisement
తెలుగు తెరకు జేమ్స్ బాండ్ అంటే, కృష్ణనే. తనయుడు మహేష్ బాబుని అలాంటి పాత్రలో చూద్దామనుకున్నారు. ఇదే విషయం చాలా సందర్భాల్లో చెప్పారు కూడా. కానీ అది కూడా కుదరలేదు. కృష్ణ, తన కొడుకులిద్దరూ రమేష్ బాబు, మహేష్ బాబు లతో నటించారు. మనవడు గౌతమ్ తోను ఓ సినిమా చేయాలనుకున్నారు. కానీ అది కూడా వీలు కాలేదు. ‘కేబిసి’ కార్యక్రమం అంటే కృష్ణకు చాలా ఇష్టం. అమితాబ్ బచ్చన్ ఈ షోని బాగా నడుపుతున్నారని చాలా సందర్భాల్లో కితాబు ఇచ్చారు. అలాంటి షో ఒకటి చేయాలనుకున్నారు. కానీ వీలు కాలేదు.
READ ALSO : T20 WC 2022 : ఛాంపియన్ ఇంగ్లండ్‌కు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే..? భారత్‌కు మరి!