Advertisement
సూపర్ స్టార్ కృష్ణ నవంబర్ 15వ తేదీన ఉదయం కన్నుమూశారు. ఆయన మృతితో టాలీవుడ్ సెలబ్రిటీలు, అభిమానులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. 350 కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించిన కృష్ణ నిర్మాతగాను తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు. అలాగే అభిరుచితో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించి దర్శకుడిగా తను ఏంటో ప్రూవ్ చేశారు. ఇక పద్మాలయ స్టూడియో అధినేతగా రాణించారు. ఒక మనిషి ఆల్ రౌండర్ గా తెలుగు సినీ చరిత్రలో ఆధ్యాయాన్ని రాశారు.
Advertisement
ఇది ఇలా ఉండగా, మాధవ రావు గారు మొదటి నుండి కృష్ణ గారికి మేకప్ మ్యాన్ గా ఉండేవారు. దాదాపు శ్రీ శ్రీ సినిమా వరకు ఆయనే పనిచేశారు. అయితే కృష్ణ మరణం తర్వాత మేకప్ మాధవరావు కృష్ణ, విజయనిర్మల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారిద్దరు ఎన్నో దానధర్మాలను చేశారంటూ చెప్పారు. విజయనిర్మల గారు చనిపోయే ఏడాది ముందు నేను ఇల్లు కొనుక్కోవాలంటే 25 లక్షలు ఇచ్చారు.
Advertisement
అప్పుగా తీసుకొని మళ్ళీ ఇచ్చేస్తానని చెప్పినా, ఏమీ వద్దు నువ్వు ఎంత సర్వీస్ చేసి ఉంటావు మాకు అన్నారు వారిద్దరి గొప్పతనం అది. ఇక ఇందిరా దేవి గారు నన్ను అన్నయ్య అని పిలిచేవారు. నా భార్యను వదిన అంటూ పిలుస్తారు. ఆప్యాయంగా పలకరిస్తారు ఇందిరా గారు అంటూ చెప్పారు. ఇక విజయనిర్మల గారిని పెళ్లి చేసుకున్నప్పుడు ఇందిరా దేవి గారు మొదట్లో కోపంగా ఉన్నా మళ్ళీ సర్దుకుపోయారు. విజయ నిర్మల గారిని పెళ్లి చేసుకున్నాక ఇందిరా గారికి మహేష్, అతని చెల్లెలు పుట్టారు. ఆయన ఇద్దరినీ బాగా చూసుకున్నారు. పిల్లలకి న్యాయం చేశారు. ఇక విజయనిర్మలను ఇందిరా దేవి గారు కూడా చాలా గౌరవంగానే చూసుకునేవారు అంటూ చెప్పారు.
Read also: ఇంటికి కట్టిన గుమ్మడికాయ త్వరగా కుళ్ళిపోతే దాని అర్థం తెలుసా..!