Advertisement
సూపర్ స్టార్ కృష్ణ టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా, దర్శకునిగా, నిర్మాతగా ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. కోట్ల సంఖ్యలో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రల్లో నటించిన కృష్ణ తరువాత కాలంలో వరుస విజయాలతో సూపర్ స్టార్ గా ఎదిగారు. కార్డియాక్ అరెస్ట్ తో ప్రముఖ ఆసుపత్రిలో చేరిన కృష్ణ చికిత్స కు కోలుకోలేక తిరిగిరాని లోకాలకు వెళ్లారు.
Advertisement
ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి కృష్ణ కొత్త టెక్నాలజీలను, కొత్త జోనర్ లను పరిచయం చేసారు. తెలుగులో తొలి ఫుల్ స్కోప్, తొలి కౌబాయ్ సినిమాలను, ఫస్ట్ జేమ్స్ బాండ్ మూవీ, తొలి 70 ఎం.ఎం. సినిమాలు కృష్ణ హీరోగా నటించిన సినిమాలే కావడం విశేషం. టాలెంట్ ఉన్న నటులను ప్రోత్సహించే విషయంలో కృష్ణ ముందు వరుసలో ఉండేవారు. అప్పట్లో ఏ హీరోకు లేనివిధంగా కృష్ణకి రికార్డు స్థాయిలో 2500 అభిమాన సంఘాలు ఉండేవి. సూపర్ కృష్ణకి సంబంధించి ఇప్పటివరకు ఎవ్వరూ చూడనటువంటి కొన్ని ఫొటోలను ఇప్పుడు మనం చూద్దాం.
సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఆఖరి చిత్రం ప్రేమ చరిత్ర కృష్ణ విజయం. ఈ సినిమా ట్రైలర్ ని ఇటీవలే విడుదల చేశారు. కన్నడలో పలు చిత్రాలకు దర్శకత్వం వహించి ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న హెచ్. మధుసూదన్ దర్శకత్వం వహించారు.
గత నాలుగు రోజులుగా కృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో కృష్ణ చాలా ఎనర్జిటిక్ గా నటించారు. కచ్చితంగా ఈ సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని దర్శకుడు పేర్కొన్నారు.
Advertisement
మరికొన్ని ముఖ్య వార్తలు :
అంబటి రాయుడికి ఏపీ సీఎం హామి ఇచ్చారా ? అందుకే ఇలా చేశాడా ?
వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి మధ్య ప్రేమ చిగురించడానికి కారణం ఆ దర్శకుడేనా ?