Advertisement
ప్రపంచంలో మన చుట్టూ జరిగే విషయాలు కొన్ని సార్లు మనకు అంతులేని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటిదే ఈ కేసు కూడా. ఓ 89 సంవత్సరాల వృద్ధుడికి విడాకులు కావాల్సి వచ్చింది. దీనితో అతను కోర్టుకెక్కాడు. జిల్లా సెషన్ కోర్టు కూడా అందుకు ఆమోదం తెలిపింది. కానీ అతని భార్య అయినా 82 ఏళ్ల వృద్ధురాలు విడాకులు వద్దనుకుంటోంది. అందుకే సుప్రీం వరకు వచ్చింది ఈ కేసు. ఇంతకీ ఈ కేసు వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం
Advertisement
ఈ జంట 1963లో వివాహం చేసుకున్నారు, కానీ నిర్మల్ 1984లో దాఖలు చేసిన చట్టపరమైన పత్రాలలో తమ సంబంధం తిరిగి కలవలేనంతగా ముక్కలైందని అందుకే విడాకులు కావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ జంట 1963లో అమృత్‌సర్‌లో సిక్కు ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు. ముగ్గురు పిల్లలు – ఇద్దరు కుమార్తెలు మరియు ఒక కుమారుడు. విడాకులకు అప్లై చేసుకున్న ఈ వ్యక్తి వైద్యుడు మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి పదవీ విరమణ పొందాడు. అతని భార్యా ఉపాధ్యాయురాలిగా పని చేసి పదవి విరమణ పొందింది. 1984 జనవరిలో భర్తకు మద్రాసులో పోస్టింగ్ రావడంతో భర్త అక్కడకి వెళ్ళాడు. కానీ, భార్య అతనితో అక్కడకి వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఆమె కొంత కాలం పాటు తన అత్తామామలతోనే ఉంది. తరువాత తన కొడుకుతో ఉంది. మద్రాసులో పోస్టింగ్ వచ్చినప్పుడు తనతో రాకుండా క్రూరంగా ప్రవర్తించింది అని, తనని వదిలేసిందని, తనకి గుండె సమస్య ఉన్నా పట్టించుకోలేదని సదరు భర్త ఆరోపించాడు. తన ప్రతిష్టను కించపరిచేలా వైమానిక దళ అధికారుల ముందు ఫిర్యాదు చేసిందని కూడా అతను ఆరోపించాడు.
Advertisement
కానీ సదరు మహిళా వాదన మరోలా ఉంది. తన వివాహాన్ని గౌరవించటానికి తాను అన్ని ప్రయత్నాలు చేశానని మరియు ఇప్పుడు కూడా అతన్ని చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని.. ఈ వయసులో విడాకులు తీసుకుని డివోర్సీగా బతకలేనని చెప్పింది. దీనితో ఆమెకు న్యాయం చెయ్యడానికే సుప్రీమ్ మొగ్గు చూపింది. అతని సపోర్ట్ లేకున్నా ముగ్గురు పిల్లలను సాకానని.. ఇప్పుడు కూడా అతన్ని చూసుకోవడానికి సిద్ధంగానే ఉన్నానని.. ఈ వయసులో విడిపోయి ఏమి సాధిస్తానని ఆవేదన చెందింది. ఆమె బాధలో న్యాయాన్ని చూసిన సుప్రీమ్ ఈ విడాకులు ఇవ్వలేము అంటూ సదరు భర్తకి తీర్పు ఇచ్చింది.
మరిన్ని..
Bhagavanth Kesari Dialogues in Telugu: భగవంత్ కేసరి డైలాగ్స్