Advertisement
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి నెలరోజులు పైనే కావొస్తోంది. చంద్రబాబు నాయుడు వేసిన క్వాష్ పిటిషన్ గురించి శుక్రవారం సుప్రీమ్ లో వాదన జరగనుంది. అయితే.. ఆయన అరెస్ట్ గురించి సుప్రీమ్ కోర్ట్ ఏమి తీర్పు చెప్పబోతోంది అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ శుక్రవారం ఆయన కేస్ గురించిన వాదనలు జరగనున్నాయి. ఈ క్రమంలో సుప్రీం తీర్పు చెప్తుందా? లేక రిజర్వ్ లో ఉంచుతుందా అని ఇటు సిబిఎన్ అభిమానులతో పాటు టీడీపీ నేతలు కూడా ఎదురు చూస్తున్నారు.
Advertisement
గత నెలరోజులుగా ఈ కేసుకు సంబంధించి వాదోపవాదాలు జరుగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు తరపు లాయర్లు ఎక్కువగా చట్ట సవరణ తర్వాత వచ్చిన 17 A గురించి వాదిస్తున్నారు. అసలు ఈ చట్టం ప్రకారం కేసు బుక్ చెయ్యాలన్నా.. ఈ నేరం చట్ట సవరణకు ముందు జరిగిందని.. ఈ కేసు బుక్ చేసిన డేట్ కూడా చట్ట సవరణ తరువాత అని వాదిస్తున్నారు. అసలు ఇది నేరం కిందకు వస్తుందా? చట్ట సవరణకు ముందు జరిగే నేరాలకు అప్పుడు అమలులో ఉన్న చట్టాలనే దృష్టిలో ఉంచుకోవాలా? అన్న చర్చలు నడుస్తూనే ఉన్నాయి.
Advertisement
ఇది ఇలా ఉంటె.. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిగానే కన్సిడర్ చేసి కేసు నమోదు చేసారని విచారణ కూడా అలానే ఉండాలని న్యాయవాది బత్తుల రామకోటయ్య చెప్పుకొచ్చారు. ఇప్పుడు సుప్రీమ్ తీర్పు ఇచ్చేముందు కూడా విచారణ ఇలానే జరుపుతుందని.. ఆ స్థాయి ఉన్న వ్యక్తులను ఎక్కువ కాలం పాటు ఆర్గుమెంట్ చేస్తూ జైల్లో ఉంచడం సాధ్యం కాదని ఆయన చెప్పుకొచ్చారు. ఈ లెక్కన శుక్రవారం వచ్చే తీర్పు చంద్రబాబు నాయుడు కు అనుకూలంగా వచ్చే అవకాశం ఉందని బత్తుల రామకోటయ్య అభిప్రాయపడ్డారు. ఈ కేసు గురించి ఆయన చెప్పిన మరిన్ని విషయాలను ఈ వీడియోలో చూడొచ్చు.
Watch Video: