Advertisement
ఒకప్పటి బాల నటులు ఇప్పుడు హీరోలు, హీరోయిన్ లా ఎంట్రీ ఇస్తున్నారు. మరికొందరు వేరే వృత్తులలో స్థిరపడుతున్నారు. ఇలా చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన తర్వాత హీరోగా చేయాలనే ప్రయత్నాలలో కొందరికి అదృష్టం కలిసి రాగా, మరికొందరికి అదృష్టం కలిసి రాలేదు. మహేష్ బాబు, ఎన్టీఆర్, తేజ సజ్జ, నిత్య శెట్టి, కమల్ హాసన్, వైష్ణవ్ తేజ్ ఇలా చాలామంది చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి సత్తా చాటారు. అయితే వెంకటేష్ హీరోగా వచ్చిన సూర్యవంశం చిత్రంలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఆనంద్ వర్ధన్ మీకు గుర్తుండే ఉంటాడు.
Advertisement
Read also: ఖడ్గం సినిమా కోసం చార్మినార్ వీధుల్లో యాక్టర్ షఫీ ఎలాంటి పనులు చేసేవాడంటే ?
Advertisement
భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో 1998లో విడుదలైన ఈ చిత్రంలో వెంకటేష్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశాడు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమాలో జూనియర్ వెంకటేష్ కొడుకుగా ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను ఆకర్షించిన ఆనంద్ వర్ధన్ ఆ తర్వాత ఎన్నో సినిమాలలో కూడా నటించారు. అయితే సూర్యవంశం చిత్రంలో ఆనంద్ నటనకు నంది అవార్డు అందుకోవడమే కాదు పలు హిట్ చిత్రాలలో నటించి చైల్డ్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నాడు. 1996లో సినీ ఇండస్ట్రీకి చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టిన ఆనంద్ సుమారు 14 చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించి ఎంతగానో అలరించాడు.
మావిడాకులు, మనసంతా నువ్వే, ప్రియరాగాలు, తిరుమల తిరుపతి వెంకటేశ, ఇంద్ర, ప్రేయసిరావే, బాల రామాయణం, నేనున్నాను వంటి చిత్రాలలో కనిపించాడు. ప్లే బ్యాక్ సింగర్ పిబీ శ్రీనివాస్ మనవడైన ఆనంద్ వర్ధన్ 2004లో వచ్చిన నేనున్నాను సినిమా తర్వాత మళ్లీ కనిపించలేదు. అయితే 2012లో తన ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్న ఆనంద్ ఆ తరువాత మార్షల్ ఆర్ట్స్, డాన్స్ లో శిక్షణ తీసుకున్నాడు. ప్రస్తుతం హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు ఆనంద్. మరి హీరోగా ఇండస్ట్రీలో రానిస్తాడో లేదో వేచి చూడాలి.
Read also: మంత్రి రోజాకి “బ్రహ్మాజీ” కౌంటర్ మాములుగా ఇవ్వలేదు గా !