Advertisement
పక్షవాతాన్ని పెరాలైసిస్ అని కూడా పిలుస్తారు. దీనిబారిన పడ్డ వారి జీవితం పూర్తిగా మారిపోతుంది. నిరంతరం ఒకరిపై ఆధారపడి జీవించాల్సి వస్తుంది. సాధారణంగా మెదడులో రక్త సరఫరా నిలిచిపోయినా , రక్తస్రావం జరిగినా ఇలా బ్రెయిన్ స్ట్రోక్ ఏర్పడి.. శరీరం పక్షవాతానికి గురి అవుతుంది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు నిర్లక్ష్యం చెయ్యకుండా సరైన సమయంలో చికిత్స తీసుకుంటే నయం అయ్యే ఛాన్స్ లే ఎక్కువ. అయితే.. ఈ స్ట్రోక్ రావడానికి ముందే మీ శరీరం మీకు కొన్ని సంకేతాలను పంపిస్తుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.
Advertisement
శరీరం చాలా బలహీనంగా అనిపిస్తుంది. ఉన్నట్లుండి ఒళ్ళంతా తిమ్మిరి పట్టినట్లు అయిపోతూ ఉంటుంది. కాలు, చేయి ఒకవైపు లాగుతున్నట్లు అనిపించడం.. ఇక ఎక్కువగా నవ్వినప్పుడు కూడా ఆ పార్ట్ అంతా లాగుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు పొరపాటున కూడా నెగ్లెక్ట్ చేయవద్దు. కొంతమందికి మాటలు కూడా తడబడుతుండడం.. మాట్లాడానికి ఇబ్బంది పడడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఇక కొంతమందికి ఏదైనా చెప్పినప్పుడు అర్ధం చేసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటూ ఉంటారు.
Advertisement
చాలా మందిలో ఉన్నట్లుండి తలనొప్పి వస్తూ పోతూ ఉంటుంది. హఠాత్తుగా తలలో తీవ్రమైన నొప్పి వస్తోందంటే.. తలలో రక్తస్రావం అవుతోందని అర్ధం. చూపు కూడా అస్పష్టంగా మారిపోతూ ఉంటుంది. ఒక వస్తువు రెండుగా కనిపించడం, మైకం కమ్మినట్లు అనిపించడం, నడిచే సమయంలో బాలన్స్ తప్పడం కూడా సంకేతాలే. ఈ లక్షణాలను స్ట్రోక్ ప్రారంభ లక్షణాలుగా గుర్తించాలి. ఈ లక్షణాలను మీరు ఎదుర్కొన్నప్పుడు ముందుగా గ్రహించి చికిత్స తీసుకుంటే పారలైజ్ అవ్వకుండా జాగ్రత్త పడచ్చు.
Read More:
కార్తీక మాసంలో పరమేశ్వరుని చల్లని చూపు.. ఈ రాశుల వారికి ఎలా ఉందంటే?
“అలాంటి కూతురు ఎవ్వరికీ ఉండకూడదు..” పురంధేశ్వరి గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసిన కొడాలి నాని..!