Advertisement
ప్రేమించి పెళ్లి చేసుకున్నా… పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నా.. పార్టనర్స్ అన్నాక గొడవలు అనేవి చాలా సహజం. అయితే.. గొడవలు ఎందుకు జరుగుతున్నాయి.. ఎలాంటి సందర్భాల్లో జరుగుతున్నాయి.. అనేవి ముందుగానే గుర్తిస్తే చాలా వరకు జీవితాలు ప్రశాంతంగా వెళ్లిపోతాయి. అయితే.. మీరు పెళ్లి చేసుకునే ముందు మీ జీవిత భాగస్వామికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో ఓ అంచనాకి రావాలి. ఎలాంటి లక్షణాలు ఉంటె.. జీవితం బాగుంటుందో తెలిసుండాలి. అయితే.. పెళ్లి చేసుకోవాలని అనుకునేవారికి కొన్ని లక్షణాలు ఉండకూడదు. అవేంటో చూడండి.
Advertisement
వీటిల్లో మొదటిది చెప్పిన మాట వినకపోవడం. కొందరు మనం ఏ ఉద్దేశ్యంతో చెబుతున్నామో, ఎందుకు చెబుతున్నామో వినరు. వారి ధోరణిలో వారు ముందుకు పోతూ వారి మాటే నెగ్గాలని అనుకుంటారు. రెండవది ఒత్తిడి తీసుకురావడం. మీ జీవిత భాగస్వామి కొన్ని విషయాల్లో తెలియకుండానే తీవ్ర ఒత్తిడి తీసుకొస్తారు. ఫోన్ ఎట్టకపోవడం, కొన్ని సార్లు బిజీ గా ఉండాలని రెస్పాండ్ అవ్వకపోవడాన్ని కూడా భరించలేరు. వీరి వలన జీవితంలో స్వేచ్ఛ ఉండదు. కనీసం స్నేహితులను కలవడానికి కూడా ఉండదు.
Advertisement
మూడవది జెలసి. కొంతమంది జెలసి ఎక్కువగా కలిగి ఉంటారు. కనీసం మీ స్నేహితులతో మాట్లాడినా అది తప్పుగానే చూస్తారు. చివరికి పిచ్చి పట్టినట్లు ఫీల్ అయ్యి.. బెదిరింపులకు కూడా దిగుతుంటారు. అందుకే మీరు రిలేషన్ లోకి అడుగు పెట్టె ముందు వారి లక్షణాలను ముందే గమనించి అడుగు వెయ్యాలి. ఒత్తిడి, టెన్షన్స్ ను పెంచే రిలేషన్లు మీకు అవసరం లేదని గుర్తుంచుకోండి. రిలేషన్ అనేది మనసుకి హాయినిచ్చేదిగా ఉండాలి.. టెన్షన్ పెట్టేదిగా ఉండకూడదు.
Read More:
సీఎం రేవంత్ రెడ్డి ఆఫర్ కి నళిని ఎలా స్పందించిందంటే..?
Telugu Paper Cartoon News: Today Cartoon in Telugu Papers 17 December 2023, తెలుగు న్యూస్ కార్టూన్స్
ఆ సమయంలో భర్త మరో మహిళతో ఉన్నా తప్పులేదు.. హై కోర్ట్ సంచలన తీర్పు!