Advertisement
టి20 వరల్డ్ కప్ 2022 టోర్నీని ఇంగ్లాండ్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. లో స్కోరింగ్ గేమ్ లో పాక్ విధించిన 138 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి ఛేదించిన ఇంగ్లాండ్, రెండోసారి టి20 వరల్డ్ కప్ ని సొంతం చేసుకుంది. మూడోసారి ఫైనల్ చేరిన పాకిస్తాన్, మరోసారి రన్నరప్ తో సరిపెట్టుకుంది. ఆసియా కప్ 2022 టోర్నీ ఫైనల్ లో ఓడిన పాక్, టి20 వరల్డ్ కప్ లో లక్కీగా ఫైనల్ చేరిన టైటిల్ మాత్రం గెలవలేకపోయింది.
Advertisement
కానీ ఈసారి మాత్రం ఛాంపియన్ గా ఇంగ్లాండ్ నిలిచింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్నిత 20 ఓవర్లలో 8 వికెట్లకు 137 పరుగులు మాత్రమే చేసింది. షాన్ మసూద్, బాబర్ ఆజామ్, ఖాన్ మినహా అంతా విఫలమయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో సామ్ కరణ్ మూడు వికెట్లకు తోడుగా, అదిల్ రషీద్, క్రిస్ జోర్డాన్ రెండు వికెట్లు తీశారు. బెన్ స్టోక్స్ కు ఓ వికెట్ దక్కింది.
Advertisement
అనంతరం లక్ష చేదనకు దిగిన ఇంగ్లాండ్ 19 ఓవర్లలో 5 వికెట్లకు 138 పరుగులు చేసింది. బెన్ స్టోక్స్ కు అండగా జోస్ బట్లర్, మొయిన్ ఆలీ రాణించారు. పాకిస్తాన్ బౌలర్లలో హరీస్ రౌఫ్ రెండు వికెట్లు తీయగా, షాహిన్ ఆఫ్రిది, షాదాబ్ ఖాన్, మహమ్మద్ వసిం తలో వికెట్ తీశారు. కీలక సమయంలో షాహిద్ షా ఆఫ్రిది గాయపడటం పాక్ విజయావకాశాలను దెబ్బతీసింది. టి20 ప్రపంచ కప్ విజేత ఇంగ్లాండ్ కు ప్రైస్ మనీ రూపంలో భారత కరెన్సీ ప్రకారం సుమారు 13 కోట్ల రూపాయలు లభించింది. అదే విధంగా రన్నరప్ గా నిలిచిన పాకిస్తాన్ భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ. 6.5 కోట్లు దక్కింది. ఇక సెమి ఫైనల్ లో ఓటమిపాలైన భారత్, న్యూజిలాండ్ కు సుమారు 3.25 కోట్లు చొప్పున అందింది. అదేవిధంగా సూపర్ 12 దశ నుంచి వైదొలిగిన 8 జట్లకు 70,000 డాలర్ల చొప్పున లభించింది.
READ ALSO : సూపర్ స్టార్ కృష్ణకు గుండెపోటు.. టెన్షన్‌లో ఫ్యాన్స్.. డాక్టర్స్ ఏమన్నారంటే!