Advertisement
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ జట్టు తిరుగులేని విజయాలతో ఫైనల్ కి చేరుకుంది హార్దిక్ పాండ్యా వరుస గాయాలు నేపథ్యంలో రాబోయే T20 వరల్డ్ కప్ కెప్టెన్ గా ఎవరిని తీసుకోవాలి అనే దాని గురించి జై షా వ్యాఖ్యలు చేశారు. వెస్టిండీస్ అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నటువంటి ప్రపంచ కప్ లో భారత జట్టు ని ముందుకు నడిపించే నాయకుడు గురించి గత కొన్ని రోజుల నుండి చర్చ సాగుతోంది ఇంతకుముందు హార్దిక్ పాండ్యా భారత్ T20 జట్టుకి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నారు వరుస గాయాలతో హార్థిక్ పాండ్యా జట్టుకి దూరమయ్యారు. దీంతో ఆఫ్గనిస్తాన్ తో జరిగిన T20 సిరీస్ లో కెప్టెన్ గా రోహిత్ శర్మ వ్యవహరించారు.
Advertisement
Advertisement
ఇక ఇది ఇలా ఉంటే రాబోయే ఐసీసీ T20 వరల్డ్ కప్ 2024 కి కూడా కెప్టెన్సీగా రోహిత్ శర్మ వ్యవహరించబోతారా అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. హార్థిక్ పాండ్యా కోలుకున్నాడు. కానీ మరి హార్థిక్ పాండ్యా కి కెప్టెన్సీ బాధ్యతలు ఇస్తారా లేకపోతే రాబోయే ఐసీసీ T20 వరల్డ్ కప్ కి రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉంటారా అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. మళ్లీ అతనికి భారత్ T20 పగ్గాలు అప్పగిస్తారని టాక్ వినబడుతుంది. బిసిసిఐ కార్యదర్శి జైశా వరల్డ్ కప్ లో భారత్ జట్టుకి కెప్టెన్సీగా ఎవరు బాధ్యత తీసుకోవాలనే దాని గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.
గత ఏడాది అక్టోబర్ లో చీలిమండ గాయం నుండి ఆల్రౌండర్ హార్దిక్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు పొట్టి ఫార్మేట్ లో రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉండాలని భావిస్తున్నామని అన్నారు అయితే. రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరించాడని ఇప్పుడు రాబోయే మ్యాచ్ లకి కూడా అతని కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవాలని అంతా అభిప్రాయపడుతున్నట్లు చెప్పారు. రోహిత్ శర్మ జట్టు ని ఎలా నడిపించాడో ఆ తీరును చూస్తే అతని నాయకత్వం గురించి పెద్దగా ప్రశ్నించలేమని జైశా అన్నారు.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!