Advertisement
ప్రముఖ నటి మీనా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే భర్త విద్యాసాగర్ ఆకస్మిక మరణంతో ఆమె విషాదంలో మునిగిపోయింది. మీనా భర్త మృతి వార్త తో దక్షిణాది సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. పుట్టడు దుఃఖంలో ఉన్న ఆమెకు అభిమానులు, సన్నిహితులు, స్నేహితులు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే, మీనా భర్త మృతికి అరుదైన ఇన్ఫెక్షన్ కారణమైంది.
Advertisement
Also Read: హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో నేల మీద పెట్టకూడని వస్తువులు…!
ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగానే విద్యాసాగర్ మృతి చెందినట్లు తెలుస్తోంది. తమిళనాడు నుండి వెలువడుతున్న కొన్ని నివేదికల ప్రకారం, విద్యాసాగర్ వారి ఇంటికి సమీపంలో ప్రతిరోజు వస్తున్న పావురాల గుంపు వాటి రెట్టల ద్వారా సోకిన గాలిని పీల్చడం ద్వారా ఊపిరితిత్తుల అలర్జీకి గురయ్యారని పేర్కొన్నారు.
Advertisement
ALSO READ: షాకింగ్: కొత్తగా పెళ్లైన మహిళలు గూగుల్లో ఏం వెతుకుతున్నారో తెలుసా?
అయితే ఇది లక్ష మందిలో ఒకరికి మాత్రమే జరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో మీనా కుటుంబం కోవిడ్ బారిన పడింది. అయితే విద్యాసాగర్ కు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్నట్లు తెలిసింది. దాంతో ఊపిరితిత్తుల మార్పిడి చేయాలని వైద్యులు సూచించారు. కానీ సరైన దాత దొరకనందున, మార్పిడి చేయడం సాధ్యం కాలేదు. అంతలోనే ఆయన మృత్యువాతపడ్డారు.
Also Read: RRRలో రాజమౌళి చేసిన చిన్న తప్పు… అప్పుడలా ఇప్పుడేమో ఇలా…!