Advertisement
ప్రపంచ స్థాయి క్రీడలలో విజేతగా నిలిచిన జట్టుకు, ఆయా రాష్ట్రాల క్రీడాకారులు వివిధ పోటీలలో గెలిచినప్పుడు.. ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖుల ఆశీర్వాదాలు తీసుకోవడం మనం తరచూ చూస్తూనే ఉంటాం. ఈ కోవలోనే భారత దివ్యాంగుల క్రికెట్ జట్టుకు కెప్టెన్ ని అంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నే బురిడీ కొట్టించాడు వినోద్ కుమార్ అనే యువకుడు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని రామనాథపురం జిల్లా కడలాడి తాలూకాలోని కీళ చెల్వనూర్ కి చెందిన వినోద్ బాబు దివ్యాంగుడు. అతను భారత వీల్ చైర్ క్రికెట్ జట్టుకు సారథ్యం వహిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నాడు.
Advertisement
Read also: ఆ హీరో కూతురుతో రామ్ చరణ్ పెళ్లి చేయాలనుకున్నారా?
తన నాయకత్వంలోనే 2022 ఆసియా కప్ ను భారత జట్టు గెలిచిందని తమిళనాడు మంత్రులు రాజకన్నప్పన్, ఉదయనిది స్టాలిన్ ని కలిశాడు. అంతేకాదు పెద్ద కప్పుతో వెళ్లి ఇదే నేను సాధించిన కప్ అంటూ సీఎం స్టాలిన్ కి కూడా చూపించాడు. పాకిస్తాన్ లోని కరాచీలో జరిగిన ఆసియా కప్ ఆడి గెలిచానంటూ మాయమాటలు చెప్పాడు. పలు అవార్డులకు సంబంధించినవి చూపించడంతో నిజమేనని నమ్మిన సీఎం స్టాలిన్, ఇతర మంత్రులు అతడికి అభినందనలు తెలిపారు. అంతేకాదు అతడికి ఆర్థిక సహాయం కూడా అందించారు. అయితే వినోద్ బాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని తమిళనాడు సెక్రటేరియట్ కి సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన ఇంటిలిజెంట్స్ విభాగం.. దర్యాప్తులో అసలు విషయాలను వెలుగులోకి తీసుకువచ్చింది.
Advertisement
జట్టులో వినోద్ బాబు సభ్యుడు కాదని, అతనికి కనీసం పాస్ పోర్ట్ కూడా లేదని తేల్చింది. అంతేకాక అతడు మాయమాటలు చెప్పి పలువురినుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు కూడా వెళ్లడైంది. సదరు దివ్యంగుడు వినోద్ కుమార్ ఏ క్రీడలలోనూ పాల్గొనలేదని, నకిలీ కప్పుతో సీఎం వద్దకు వెళ్లి బురిడీ కొట్టించాడని ఇంటెలిజెన్స్ విభాగం తేల్చేసింది. వినోద్ బాబు మాటలు నమ్మి ఛత్రకుడికి చెందిన ఓ బేకరీ యాజమాని అతడికి లక్ష రూపాయలు ఇచ్చారు. అలాగే పలువురు మంత్రులు కూడా అతడికి ఆర్థిక సహాయం చేసినట్లు సమాచారం. రామనాథపురం ఏబిజె మిస్సైల్స్ పారాస్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శరవన్ కుమార్ ఫిర్యాదు మేరకు వినోద్ బాబు పై పోలీసులు కేసు నమోదు చేశారు. దివ్యాంగుడు వినోద్ బాబు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.