Advertisement
నందమూరి ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలలో తారకరత్న కూడా ఒకరు. అయితే నారా లోకేష్ 2023 జనవరిలో యువగలం పేరుతో పాదయాత్రని కుప్పం నియోజకవర్గంలో మొదలుపెట్టారు. ఈ పాదయాత్రకి మద్దతుగా తారకరత్న, బాలకృష్ణ కూడా పాల్గొన్నారు. అస్వస్థకి గురై తారకరత్న కుప్పకూలిపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. బెంగళూరులో ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటున్న తారకరత్న ఫిబ్రవరి 18న కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే తారకరత్న చనిపోయి ఇప్పటికి ఆరు నెలలు పూర్తి అవుతోంది. ఆయన భార్య అలేఖ్య రెడ్డి మాత్రం ఆయన జ్ఞాపకాల నుండి ఇంకా బయటికి రాలేకపోతున్నారు.
Advertisement
ప్రతి రోజు ఆయననే తలుచుకుంటున్నారు నెలలు గడుస్తున్నా కూడా ఆమె అందులో నుండి బయటకు రాలేకపోతున్నారు. ఆమె మానసిక వేదన అనుభవిస్తున్నారని సోషల్ మీడియాలో పోస్ట్స్ చూస్తే మనకి క్లియర్ గా తెలుస్తుంది. తారకరత్న అలేఖ్య రెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దలు ని ఎదిరించి ఒకటయ్యారు. తారక రత్న భార్య అలేఖ్య రెడ్డి కాస్ట్యూమ్ డిజైనర్. తారకరత్న హీరోగా వచ్చిన నందీశ్వరుడు సినిమాకి ఆమె పని చేశారు. అలా వేళ్ళు ఒకరికొకరు పరిచయం అయ్యారు. పరిచయం కాస్త ప్రేమగా మారింది.
Advertisement
అప్పటికే అలాగే రెడ్డి పెళ్లి చేసుకుని విడాకులు కూడా తీసుకుంది. ఈ కారణంగానే తారకరత్న తల్లిదండ్రులు వాళ్ళ పెళ్లికి ఒప్పుకోలేదు. అయినా సరే గుడిలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు వీళ్ళు. ఆ తర్వాత ఇబ్బందుల నుండి నెమ్మదిగా బయటపడి ముగ్గురు పిల్లలతో హాయిగా ఉంటున్నారు. కానీ తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో అలేఖ్య రెడ్డి, పిల్లలు కూడా ఇబ్బందుల్లో పడిపోయారు. అలేఖ్య రెడ్డి ఇప్పుడు పిల్లల బాధ్యతని ఒంటరిగా నెరవేరుస్తోందని తెలుస్తోంది.
Also read: