Advertisement
నందమూరి తారకరత్న ఆరోగ్య విషయం తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు, ప్రత్యేకంగా నందమూరి అభిమానులు ఆయన కోలుకోవాలని కోరుకుంటున్నారు.. అలాంటి నందమూరి తారకరత్న నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రలో అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటుగా నిర్ధారించిన వైద్యులు సీరియస్ గా ఉండడంతో బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు.
Advertisement
ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ జారీ చేస్తున్నారు. తాజాగా వచ్చిన ఒక అప్డేట్ ప్రకారం.. తారకరత్నకు సిటీ స్కాన్ తీశారు. ఆ స్కానింగ్ రిపోర్టులో వైద్యులు కీలక విషయాలను గుర్తించినట్టు సమాచారం. ఆయనకు ఆక్సిజన్ తక్కువగా అందడం వల్ల బ్రెయిన్ కు ఎఫెక్ట్ అవుతున్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో బ్రెయిన్ డ్యామేజ్ రికవరీపై వైద్య నిపుణులు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఐసీయూలో తారకరత్న చికిత్స పొందుతున్న ఫోటో ఒకటి బయటకు లీక్ అయింది.
Advertisement
దీంతో వెంటిలేటర్ పై ఉన్న తారకరత్నను చూసి అభిమానులు తల్లడిల్లి పోతున్నారు. నిన్నలా చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది అన్న.. త్వరగా కోలుకొని తిరిగి రా అన్న అంటూ కామెంట్లు పెడుతున్నారు.. ఇప్పటికే తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై నందమూరి మరియు నారా కుటుంబ సభ్యులు చంద్రబాబు, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వంటి వారు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి వెళ్లి వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.
also read: